విధాత: ఢిల్లీలోని తమ భారత రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. తమ కార్యాలయ కార్యకలాపాలను గురువారం నుంచి బంద్ పెడుతున్నట్టు తెలిపింది. భారత ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న నిరంతర సవాళ్లు’ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది.
ఇంతకుముందు ఈ ఏడాది సెప్టెంబర్ 30న కూడా ఎంబసీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భారత్ వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అఫ్ఘన్ రిపబ్లిక్ నుంచి వచ్చిన దౌత్యవేత్తలందరూ భారతదేశాన్ని విడిచి వెళ్లారు. భారతదేశంతో ఆఫ్ఘన్ రిపబ్లిక్ మధ్య ఉన్న 22 సంవత్సరాల దౌత్యపరమైన అనుబంధానికి బ్రేక్ పడింది.