Site icon vidhaatha

Daggubati-Chandrababu: తోడల్లుళ్లు.. ఒక్కటయ్యారు..!

Daggubati-Chandrababu:

విధాత, వెబ్ డెస్క్: దివంగత మాజీ సీఎం ఎన్.టీ.రామారావు అల్లుళ్లు సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu), మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao)లు ఒక్కటయ్యారు. 30ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు అనంతరం వారిద్ధరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా ఇన్నాళ్లుగా ఉన్న విభేదాలు పక్కన పెట్టి దగ్గుబాటి తను రచించిన ప్రపంచ చరిత్ర (World history) పుస్తకావిష్కరణ (book launch) కార్యక్రమానికి రావాలని స్వయంగా ఇటీవల చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆహ్వానించారు.

గురువారం విశాఖ పట్నం గీతం యూనివర్సిటీలో జరిగిన దగ్గుబాటి పుస్తకావిష్కరణకు సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు (Venkaiah Naidu), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎంపీ భరత్ ముఖ్య అతిథిలుగాహాజరయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద చంద్రబాబు, దగ్గుబాటిలు పరస్పరం ఆలింగనం చేసుకోవడంతో పాటు తమ ఉపన్యాసాల్లో పరస్పరం పొగడ్తలు కురిపించుకున్నారు.

దగ్గుబాటి తన ప్రసంగంలో నాకు చంద్రబాబుతో వైరం ఉందని అంటుంటారని… అది నిజమే. కానీ ఇప్పుడు కాదన్నారు. ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదని.. కాలానికి అనుగుణంగా మారాలని… ఉన్న ఒకే జీవితాన్ని ఆస్వాదించాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాట్లాడుతూ దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు నా తోడల్లుడు. ఎన్టీఆర్ వద్ధ ఇద్ధరం అన్ని నేర్చుకున్నామని.. అయితే ఆయన పుస్తకం రాస్తారని నేనెప్పుడూ అనుకోలేదన్నారు.

రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వర్ రావు. ఎవరూ చేయని సాహసాన్ని ఆయన చేశారని.. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలతో పుస్తకం రాశారన్నారు. ఎన్ని కష్టాలున్నా ఆయన సంతోషంగా కనిపిస్తారన్నారు. ఇటీవల ఎన్నికల్లో పురంధేశ్వరీ చొరవను అందరం చూశామని..రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అది ఉపయోగపడిందని అన్నారు.

Exit mobile version