Alia Bhatt: బబ్లీ బ్యూటీ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది అలియా. ఈ సినిమా తర్వాత బ్రహ్మస్త్రా అనే చిత్రంతో కూడా అలరించింది.
రానున్న రోజులలో కూడా తను నటించిన చిత్రాలని కూడా తెలుగులో విడుదల చేసే ప్లాన్ చేస్తుంది అలియా భట్.. ఈ భామ చాక్లెట్ బాయ్ రణబీర కూపూర్‌ని ప్రేమ వివాహం చేసుకోగా, వీరి వైవాహిక జీవితానికి గుర్తుగా ఓ చిన్నారి కూడా జన్మించింది. పాప పుట్టిన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగా ఉన్న అలియా భట్ ఇప్పుడు మళ్లీ తన జోరు పెంచింది.
అలియా భట్ రీసెంట్‌గా రణ్‌వీర్ సింగ్‌తో కలిసి రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ అనే సినిమా చేసింది. ఈ చిత్రం తర్వలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు అలియా భట్ హాలీవుడ్ చిత్రంతో కూడా పలకరించబోతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే అలియా భట్ సింప్లిసిటీ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ భామ తన బంధువులతో కలిసి ముంబైలోని ఓ ఏరియాలో ప్రత్యక్షం అయింది.
అలియా భట్ లాంటి స్టార్ హీరోయిన్ కళ్ల ముందు ఉంటే ఫొటోగ్రాఫర్స్ ఆగుతారా.. ఆమెను తమ కెమెరాలలో బంధించేందుకు ఫోటోగ్రాఫర్స్ ఉత్సాహం చూపించారు. అయితే అలియా ఎలాంటి చిరాకు పడకుండా వారి కోసం కొన్ని పోజులు ఇచ్చింది. ఈ క్రమంలో ఫోటోస్ తీసే కంగారులో ఓ ఫోటోగ్రాఫర్ చెప్పు కాలు నుంచి జారిపోయింది.
అయితే ఇది గమనించిన అలియా భట్.. ఆ చెప్పు ఎవరిది అని అడుగుతూ.. ఆ చెప్పుని తన చేతితో పట్టుకుని సదరు వ్యక్తికి ఇచ్చింది. అలియా సింప్లిసిటీని చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయి ఉండి ఫొటోగ్రాఫర్ చెప్పుని అలా చేతితో పట్టుకోవడం చాలా గ్రేట్ అంటూ అలియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు అలియాకి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
Awww #AliaBhatt is just sooo helpful