Kolhapur | అందరి  చూపు కొల్లాపూర్ వైపే.. 20న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ

Kolhapur సభకు ప్రియాంకగాంధీ హాజరు జూపల్లి తోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరిక సభకు భారీ ఎత్తున సన్నాహాలు ఇప్పటికే కొల్లాపూర్ కు వచ్చిన జూపల్లి విధాత, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రoలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడం తో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం అందరి చూపు కొల్లాపూర్ నియోజక వర్గం పై ఉంది.ఈ నెల 20 న కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో భారీ […]

  • Publish Date - July 11, 2023 / 09:55 AM IST

Kolhapur

  • సభకు ప్రియాంకగాంధీ హాజరు
  • జూపల్లి తోపాటు పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరిక
  • సభకు భారీ ఎత్తున సన్నాహాలు
  • ఇప్పటికే కొల్లాపూర్ కు వచ్చిన జూపల్లి
విధాత, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రoలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడం తో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం అందరి చూపు కొల్లాపూర్ నియోజక వర్గం పై ఉంది.ఈ నెల 20 న కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్య అథితిగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరువుతున్నారు.
ఈ సందర్బంగా ఆ యా పార్టీ లకు చెందిన ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్న సందర్బంగా ఈ సభను కాంగ్రెస్ పార్టీ భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభ నిర్వహణ కోసం జూపల్లి కృష్ణారావు మంగళవారం కొల్లాపూర్ పట్టణానికి వస్తున్నారు. ఈ సభనుంచే ఆయన ఎన్నికల శoఖరావం పూరించనున్నారు.
ఇదివరకే ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను కలిశారు.వీరి ఆ శీర్వాదo తీసుకున్నకే కొల్లాపూర్ లో భారీ సభకు ప్లాన్ వేశారు. ఈ సభ ద్వారా తన కార్యాచరణ ప్రకటించానున్నారు.గతంలో తెరాస నుంచి కొల్లాపూర్ నియోజక అభ్యర్థి గా గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు.2019 లో జరిగిన ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థి గా భరిలోకి దిగిన జూపల్లి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు.
ఈ ఎన్నికల తరువాత హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరారు. అప్పటి నుంచి తెరాస అధిష్టనం జూపల్లి ని పట్టించుకోలేదు. అయినా జూపల్లి మాత్రం పార్టీ ని నమ్ముకుని ఉన్నారు. రోజురోజుకు తెరాస లో హర్షవర్ధన్ రెడ్డికి ప్రాధాన్యత పెరగడం జూపల్లి కి మింగుడు పడలేదు. దీంతో కొల్లాపూర్ నియోజకవర్గం లో తెరాస లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే బీరం పార్టీ కార్యక్రమాలకు కూడా జూపల్లి ని దూరం పెట్టారు.
అయినా జూపల్లి తన కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారు. ఈ మధ్య కెసిఆర్ ఓ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే టికెట్ అని ప్రకటించడం తో ఆశావావులంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇక కొల్లాపూర్ తెరాస నుంచి తెరాస నుంచి టికెట్ వస్తుందనే ఆశలు కోల్పోయినా జూపల్లి ప్రత్యమ్యయంగా కాంగ్రెస్ వైపు మొగ్గుచుపారు.దీంతో ఆయన ముందుగా ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసి రాజకీయ చర్చలు జరిపారు. ఇరువురు కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గుచూపారు.
ఇటీవల ఖమ్మం లో ఏర్పాటు చేసిన బహిరంగా సభలో కాంగ్రెస్ అధి నేత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ సభను స్ఫూర్తి గా తీసుకున్న జూపల్లి తన చేరిక కూడా ఇ దే విధంగా ఉండాలని అనుకున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు ఈ నెల 20న ముహూర్తం పెట్టుకున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అధినాయకురాలు ప్రియాంక గాంధీని ఆవ్వానించారు. కనీవిని ఎరుగని రీతిలో ఈ సభ నిర్వహించాలని కాంగ్రెస్ కరకర్తలకు జూపల్లి పిలుపునిచ్చారు.
ఇదే సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో నాగర్ కర్నూల్ brs నేత కూచు కుళ్ళ దామోదర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి, కొడంగల్ మాజీ mla, ప్రస్తుత తెరాస brs నేత గురునాథ్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా కు జిల్లా పరిషత్ చైర్మన్ సరిత కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుడడం తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సహం ఉప్పొంగుతోoది. కొల్లాపూర్ గడ్డ నుంచే brs ఓటమి మొదలవు తుందని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు ఛాలెంజ్ గా తీసుకున్నారు.

Latest News