Site icon vidhaatha

Allu Arjun | ప‌డవ బోల్తా ప‌డి నీళ్ల‌లో పడిపోయిన సుకుమార్.. ప్రాణాల‌కి తెగించి కాపాడిన అల్లు అర్జున్

Allu Arjun |

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేష‌న్స్‌గా అల్లు అర్జున్- సుకుమార్ డ్యుయోని చెప్ప‌వ‌చ్చు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఆర్య, ఆర్య‌2, పుష్ప చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. పుష్ప చిత్రంతో బ‌న్నీ ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డ్‌కి కూడా ఎంపిక‌య్యాడు. త్వ‌ర‌లోనే ఆ అవార్డ్ అందుకోనున్నాడు. అయితే బ‌న్నీకి ఈ అవార్డ్ ద‌క్క‌డం ప‌ట్ల సుకుమార్ చాలా సంతోషించ‌డ‌మే కాకుండా ఎమోష‌న‌ల్ కూడా అయ్యాడు.

అల్లు అర్జున్-సుకుమార్ కెరీర్ ఒకే సమయంలో మొదలు కాగా, వీరి ఇద్దరికీ బ్రేక్ ఇచ్చిన సినిమా ఆర్య‌. అయితే అల్లు అర్జున్‌ని సుకుమార్ హీరోగానే కాకుండా ప‌ర్స‌న‌ల్‌గా కూడా చాలా అభిమానిస్తాడు. అందుకు ఓ కార‌ణం ఉంది. షూటింగ్ స‌మ‌యంలో బ‌న్నీ తన ప్రాణాల‌కి తెగించి సుకుమార్‌ని కాపాడాడ‌ట‌. ఈ విష‌యాన్ని సుకుమారే స్వ‌యంగా చెప్పుకొచ్చాడు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆర్య చిత్రం ఇటు సుకుమార్‌కి, అటు అల్లు అర్జున్ కి ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా షూటింగ్ జరిగే టైంలో అనుకోకుండా సుకుమార్ నీళ్లలో ప‌డి మునిగిపోయారట. హీరోయిన్ బోట్ నుంచి దూకే సన్నివేశం చిత్రీకరిస్తున్న స‌మ‌యంలో హీరోయిన్ స‌డెన్‌గా బోటులోకి దూక‌గానే అది తిర‌గ‌బ‌డింది.

అప్పుడు సుకుమార్ నీళ్ల‌లో ప‌డిపోయార‌ట. సుకుమార్‌కి ఈత రాక‌పోవ‌డంతో ఆయ‌న నీళ్ల‌లో మునుగుతూ తేలుతూ ఉన్నార‌ట‌.ఇక తాను చనిపోతాను అని సుకుమార్ అనుకున్నాడ‌ట. చిత్ర యూనిట్ కాపాడేందుకు ట్రై చేస్తున్న స‌మ‌యంలో బ‌న్నీ స‌డెన్ గా వాట‌ర్‌లోకి దూకి త‌న‌ని వాట‌ర్ నుండి పైకి లాగాడ‌ట‌.

అయితే అప్పుడు తాను భ‌యంతో బ‌న్నీని కింద‌కి లాగిన‌ట్టు చెప్పాడు సుకుమార్. ఇక ఇద్దరం కూడా మునిగిపోతున్న స‌మ‌యంలో మ‌రో ముగ్గురు వ్య‌క్తి వీరిని కాపాడార‌ట‌. త‌న‌కు ప్రాణ‌దానం చేసిన దేవుడు అల్లు అర్జున్ అని, అందుకే అత‌నిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాన‌ని సుకుమార్ చెప్పాడు.

అయితే నీటి నుండి బయటికి వచ్చాక థాంక్స్ డార్లింగ్ అని అల్లు అర్జున్ కి చెబితే అప్పుడు అల్లు అర్జున్ త‌న‌తో ఓ ప్రామిస్ చేయించుకున్నాడ‌ట‌. కృత‌జ్ఞ‌త వ‌ద్దు కాని ప్రామిస్ చేయండి.. నేను నటించే ఏడు సినిమాలకి మీరే కథలు రాయాలి అంటూ సుక్కూ ద‌గ్గ‌ర ప్రామిస్ తీసుకున్నాడ‌ట‌. బన్నీకి సినిమాలపై అంత పిచ్చి ఉంటుంది సుకుమార్ ఓ సంద‌ర్భంలో తెలియ‌జేశాడు.

Exit mobile version