Pushpa 2 | చాలా గ్యాప్ తీసుకుంటోన్న పుష్ప రాజ్.. పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడంటే..

Pushpa 2 విధాత‌: ‘పుష్ప’ సినిమాలో నటించిన నటనతో ఐకాన్ స్టార్ అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డుకు సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు. దీంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బన్నీకి అభినందనలు వెల్లువెత్తాయి. ఇక ఈ ఊపులో అందరి కళ్లు ‘పుష్ప 2’పై పడ్డాయి. జీనియస్ డైరెక్టర్ […]

  • Publish Date - September 11, 2023 / 02:34 PM IST

Pushpa 2

విధాత‌: ‘పుష్ప’ సినిమాలో నటించిన నటనతో ఐకాన్ స్టార్ అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డుకు సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు. దీంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బన్నీకి అభినందనలు వెల్లువెత్తాయి.

ఇక ఈ ఊపులో అందరి కళ్లు ‘పుష్ప 2’పై పడ్డాయి. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘పుష్ప ది రైజ్’.. సంచలన విజయం సాధించడంతో.. ఇప్పుడంతా ‘పుష్ప’గాడి రూలింగ్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు.

2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్‌గా ‘పుష్ప’ నిలవడంతో పాటు బన్నీకి జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా ఈ సినిమా ఇంకా వార్తలలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ‘పుష్ప1’కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ‘పుష్ప ద రూల్’ చిత్రంపై ఓ రేంజ్‌లో అంచనాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్రయూనిట్ గుడ్ న్యూస్ అందించింది. సోమవారం ‘పుష్ప 2’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.