అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్స్‌ షురూ..! ఐఫోన్స్‌పై భారీగా డిస్కౌంట్‌ ఆఫర్స్‌..!

  • Publish Date - October 8, 2023 / 06:04 AM IST

విధాత‌: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్స్‌ షురూ అయ్యాయి. ప్రైమ్‌ మెంబర్స్‌ ఒకరోజు ముందుగానే ప్రారంభం కాగా.. 8వ తేదీ నుంచి అందరికీ సేల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ మొబైల్స్‌, స్మార్ట్ టీవీలు, హోం అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఫ్యాషన్‌ తదితర అన్ని రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్‌ ఆఫర్‌పై అందుబాటులో ఉన్నాయి.


అయితే, ఆపిల్‌ మొబైల్స్‌ కొనాలనుకునే వారికి ఇదో మంచి అవకాశం ఐఫోన్‌ 13, 14 సిరీస్‌పై ఫోన్లపై భారీగా డిస్కౌంట్‌తో ఫోన్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నది. ఐ ఫోన్ 13ని రూ.52,499, ఐ ఫోన్ 14ను రూ.61,999, ఐ ఫోన్ 14 ప్లస్ రూ.70,999, ఐ ఫోన్14 ప్రొ రూ.1,19,990.. ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ రూ.1,77,999 దక్కించుకునే అవకాశం ఉంది. వీటితో పాటు వన్‌ప్లస్‌, శామ్‌సంగ్‌, రియల్‌ మీ తదితర బ్రాండ్‌లకు చెందిన మొబైల్స్‌పై సైతం భారీగా డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి.


రూ.40వేలకే వన్ ప్లస్ 11ఆర్ 5జీ మొబైల్‌..


వన్ ప్లస్ 11ఆర్ 5జీ లో 6.7-అంగుళాల 120 హెచ్‌జడ్‌ సూపర్ ఫ్లూయిడ్ అమొలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8ప్లస్‌ ఫస్ట్‌ జనరేషన్‌ చిప్ సెట్, 8జీబీ ర్యామ్ ఉంటాయి. వీటి ద్వారా వేగవంతమైన మల్టీ టాస్కింగ్, గేమింగ్ సాధ్యమవుతాయి. వన్ ప్లస్ 11ఆర్ 5జీలో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అమెజాన్ ఫెస్టివల్‌ సేల్‌లో ఈ ఫోన్‌ రూ.39,999 రానుండగా.. ఎస్‌బీఐ తదితర క్రెడిట్‌ కార్డులపై మరింత డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి.


రూ.57వేలకే వన్ ప్లస్ 11 5 జీ..


వన్ ప్లస్ 11 5 జీ స్మార్ట్ ఫోన్ (8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్) అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.56,998 డీల్‌ అందబాటులో ఉంది. అలాగే దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ సైతం వర్తించనున్నాయి. మొబైల్‌ ఫీచర్స్‌ విషయానికి వస్తే 6.7-అంగుళాల అమొలెడ్ క్యూహెచ్ డీ డిస్‌ప్లే ఉంటుంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా, 48 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 32 ఎంపీ టెలీఫొటో లెన్స్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్‌ జనరేషన్‌ వన్‌ చిప్ సెట్, 8జీబీ ర్యామ్‌తో రానున్నది. వీటితో పాటు శామ్‌సంగ్‌, రెడ్‌మీ, రియల్‌ మీ, ఒప్పొ, హానర్‌ తదితర కంపెనీలకు చెందిన మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ లభించనున్నది.