ఏఐ చాట్ బాట్ తీసుకురాబోతున్న అమెజాన్

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ చాట్‌బాట్‌ హవా కొనసాగుతున్నది. ఈ క్రమంలో పలు కంపెనీలు ఏఐ చాట్‌బాట్‌లను తీసుకువస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ సైతం ఏఐ చాట్‌బాట్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు ప్రకటించింది

  • Publish Date - December 2, 2023 / 06:51 AM IST

విధాత‌: ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ చాట్‌బాట్‌ హవా కొనసాగుతున్నది. ఈ క్రమంలో పలు కంపెనీలు ఏఐ చాట్‌బాట్‌లను తీసుకువస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ సైతం ఏఐ చాట్‌బాట్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ చాట్‌బాట్‌కు ‘అమెజాన్‌ క్యూ’ అని నామకరణం చేసింది. అయితే, క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ రంగంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ అగ్రగామిగా ఉండగా.. ఏఐ చాట్‌బాట్‌ను ఆలస్యంగా తీసుకువస్తున్నది. ఇప్పటికే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ సైతం చాట్‌బాట్‌లను పరిచయం చేయగా.. ఓపెన్‌ ఐ చాట్‌ జీపీటీ దూసుకుపోతున్నది.


అమెజాన్ క్యూ అంటే..?


‘అమెజాన్‌ క్యూ’ చాట్‌బాట్‌ని ‘కొత్త రకం జనరేటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పవర్డ్‌ అసిస్టెంట్‌’ అని అమెజాన్‌ పేర్కొంటుంది. ప్రత్యేకంగా వ్యాపారాల కోసం రూపొందించినట్లు తెలుస్తున్నది. ఇది కంపెనీ ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. కంటెంట్‌ను సైతం రూపొందిస్తుంది. డేటాను ఉపయోగించి వివిధ ఆప్షన్‌ను సైతం సూచించగలుగుతుంది. అమెజాన్ కంపెనీ.. చాట్‌బాట్‌పై తన బ్లాగ్‌లో వివరించింది.


మీ వ్యాపారానికి అనుగుణంగా చాట్‌బాట్‌ పని చేస్తుందని, కంపెనీ సమాచారం, రిపోజిటరీలు, కోడ్, డేటా, ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్‌లకు కనెక్ట్ చేసి సేవలు పొందవచ్చని తెలిపింది. కంటెంట్‌ను రూపొందించేందుకు పలు ఇన్‌సైట్స్‌ను పొందేందుకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. అలాగే ఉద్యోగులకు పనులను క్రమబద్ధీకరించడానికి, వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు, సమస్యల పరిష్కారం, పనిలో సృజనాత్మకత పెంపొందించేందుకు అవసరమైన సమాచారం, సలహాలు, సూచనలు అందిస్తుందని అమెజాన్‌ తెలిపింది.

Latest News