పర్యాటక వీసాలు ప్రకటించిన అమెరికా.. ఆనందంలో తెలుగువారు

విధాత: తెలంగాణ వారికి తీపి కబురు. ఎంతో కాలంగా అమెరికా పర్యాటక వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి బీ1, బీ2 వీసాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు అమెరికా కాన్సులేట్‌ తెలియజేసింది. 2020 మార్చి తర్వాత కరోనా నేపథ్యంలో పర్యాటక వీసాలను అమెరికా రద్దు చేసింది. నాటి నుంచి ఎంతో మంది తెలుగువారు అమెరికా వేళ్లలేక పోతున్నారు. కేవలం పర్యాటకం కోసమే కాకుండా కుటుంబీకులు, బంధువులు అమెరికాలో ఉన్నవారిని చూసేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. కరోనా తగ్గుముఖం […]

  • Publish Date - December 30, 2022 / 08:24 AM IST

విధాత: తెలంగాణ వారికి తీపి కబురు. ఎంతో కాలంగా అమెరికా పర్యాటక వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి బీ1, బీ2 వీసాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు అమెరికా కాన్సులేట్‌ తెలియజేసింది. 2020 మార్చి తర్వాత కరోనా నేపథ్యంలో పర్యాటక వీసాలను అమెరికా రద్దు చేసింది. నాటి నుంచి ఎంతో మంది తెలుగువారు అమెరికా వేళ్లలేక పోతున్నారు.

కేవలం పర్యాటకం కోసమే కాకుండా కుటుంబీకులు, బంధువులు అమెరికాలో ఉన్నవారిని చూసేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. కరోనా తగ్గుముఖం పట్టినా ఇన్నాళ్లూ అమెరికా వీటిని పునరుద్ధరించలేదు. రెండేండ్ల తర్వాత అమెరికా పర్యాటక వీసాల స్లాట్లను కాన్సులేట్‌ విడుదల చేసింది.

కానీ హైదరాబాద్‌ కాన్సులేట్‌ మాత్రం చాలా పరిమిత సంఖ్యలోనే వీసాల స్లాట్లను విడుదల చేసినట్లు తెలుస్తున్నది. అందుకే చాలా మంది తెలుగువారు సులువుగా స్లాట్లు దొరికే చెన్నై, ఢిల్లీ నగరాల్లోని అమెరికా కాన్సులేట్లకు పరుగులు తీస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికైనా పర్యాటక వీసాలు అందుబాటులోకి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.