Traditional Indian Bed
విధాత: సాధారణంగా మనం నిద్రించే మంచం ధర ఎంత ఉంటుంది? నులక మంచం అయితే ఏ రెండు వేల రూపాయలో.. మూడో వేల రూపాయలో ఉంటుంది. నాణ్యమైన కర్రతో చేసిన నవారు మంచం అయితే పదివేల వరకు ధర ఉండొచ్చు. టేకు మంచం మంచి డిజైన్‌తో కూడినదైతే రూ.20వేలు ధర పలుకవచ్చు.
కానీ, మామూలు నులక మంచం ధర అక్షరాల లక్ష రూపాయలు అంటే ఎవరైనా నమ్మగలరా? నమ్మాల్సిందే! ఎందుకంటే ఆన్‌లైన్‌లో లక్షకంటే పైచిలుకు ధరకే విక్రయించారు మరీ!! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నమ్మలేని నిజం. ఈ వార్త వెబ్‌సైట్ వైరల్‌గా మారింది.
అమెరికాలో సాధారణ మంచాలు కూడా లక్షల్లో ధర పలుకుతున్నాయి. వివిధ రంగుల నవారుతో కూడిన మంచాలు అత్యధిక ధరలకు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. జిగేల్‌మనే స్టూళ్లు సైతం జోరుగా సేల్ అవుతున్నాయి.
భారతీయ సంప్రదాయ మంచాలు అంటూ ఆన్‌లైన్‌లో సేల్‌కు పెట్టగానే వినియోగదారులు కొనేస్తున్నారు. Etsy వెబ్‌సైట్ అనేక రకాల దేశీయ మంచాలను విక్రయిస్తున్నది. ఈ మంచాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారని వెబ్‌సైట్ పేర్కొన్నది. స్టాక్ తక్కువగా ఉన్నది.. త్వరపడండి అంటూ సూచన బోర్డులు పెట్టింది. ఇప్పడు చెప్పండి.. మీరు కొనగలరా? లక్ష రూపాయలు పెట్టి ఒక మంచం కొనగలరా?