- 300 మందికిపైగా గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
- అజర్ బైజాన్ దేశంలో రాత్రివేళ ప్రమాదవశాత్తు ఘటన
విధాత: ఫ్యూయల్ డిపోలో పేలుడు సంభవించి 20 మంది చనిపోయారు. మరో 300 మంది గాయపడ్డారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉన్నది. టర్కిస్ ఆరు స్వతంత్య్ర రాజ్యాల్లో ఒకటైన అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కరాబాఖ్ ఫ్యూయల్ డిపోలో సోమవారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు గల కారణాలు ఇప్పటికీ తెలియ రాలేదు.
స్టెపానకెర్ట్ నగరానికి సమీపంలో పేలుడు సంభవించడంతో 20 మంది అక్కడికక్కడే చనిపోయినట్టు అధికారులు తెలిపారు. కాలిన గాయాలతో ఉన్న సుమారు 290 మందిని సమీప దవాఖానలకు తరలించారు. నాలుగు వేర్వేరు దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల ప్రాణాలను రక్షించడానికి వైద్యులు తమ వంతు కృషి చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.