Site icon vidhaatha

Shocking: ఇంటి కింద.. బ‌య‌ట‌ప‌డ్డ పురాతన శివాలయం!

Shiva Temple Under A House: దేవాలయాల నెలవైన భారత దేశంలో ఎక్కడో ఓ చోట ప్రాచీన ఆలయాలు తవ్వకాల్లో బయటపడటం తరుచూ చూస్తుంటాం. ప్రకృతి విపత్తులలో కొన్ని, విదేశీయుల దండయాత్రల్లో కొన్ని అద్భుత దేవాలయాలు ధ్వంసమవ్వడం.. భూస్థాపితం కావడం జరిగింది. అలా కనుమరుగైన ఆలయాల ఆనవాళ్లు తరుచు వెలుగు చేస్తుండగా… అలాంటి ఘటనే నంద్యాల జిల్లా బనగానపల్లె  పేరుసోముల గ్రామంలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ ఓ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడటం వైరల్ గా మారింది.

ఎర్రమల అనే వ్యక్తి కొత్త ఇల్లు నిర్మాణం కోసం పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటికి పునాదులు తీయిస్తున్నాడు. ఈ క్రమంలో పురాతన శివాలయం బయట పడింది. సొరంగంలా ఉన్న గుంట రావడంతో తవ్వుతూ వెళ్లగా శివాలయం బయడపడింది. బ్రహ్మ సూత్రంతో కూడిన శివలింగం దర్శనమిచ్చింది. పురాతన శివాలయం వెలుగు చూసిన విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, చుట్టు పక్కల గ్రామాల వారు పెద్ధ ఎత్తున శివయ్యను దర్శించుకునేందుకు తరలివచ్చి పూజలు చేయడం మొదలు పెట్టారు.

ఇన్నాళ్లుగా తాము నిర్మించుకున్న ఇంటి కింద పురాతన శివాలయం ఉండటంతో వెంటనే ఎర్రమల ఆ ఇంటిని ఖాళీ చేసి మరో ఇంటికి వెళ్లిపోయాడు. పురాతన శివాలయాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు భావిస్తున్నారు.

Exit mobile version