AP Budget session | నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. మంత్రులకు బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ బడ్జట్ అసెంబీ సమావేశాలు (AP Assembly Budget session )కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జట్ను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నందున ఇవే చివరి బడ్జట్ ఎన్నికలు అని చెప్పవచ్చు. వచ్చే ఏడాది ఎలాగు పూర్తి బడ్జట్ ఉండదు… ఓటాన్ ఎకవుంట్ (otan budget )బడ్జట్ కాబట్టి ఇప్పుడు జరిగేవే పూర్తి బడ్జట్ సమావేశాలు ( Budget session )అని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలో సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలను […]

  • Publish Date - March 14, 2023 / 01:10 AM IST

ఆంధ్రప్రదేశ్ బడ్జట్ అసెంబీ సమావేశాలు (AP Assembly Budget session )కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జట్ను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నందున ఇవే చివరి బడ్జట్ ఎన్నికలు అని చెప్పవచ్చు. వచ్చే ఏడాది ఎలాగు పూర్తి బడ్జట్ ఉండదు… ఓటాన్ ఎకవుంట్ (otan budget )బడ్జట్ కాబట్టి ఇప్పుడు జరిగేవే పూర్తి బడ్జట్ సమావేశాలు ( Budget session )అని చెప్పవచ్చు.

ఇక ఈ నేపథ్యంలో సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలను సమాధానాలు ఇచ్చే బాధ్యతను పలువురు మంత్రులకు అప్పగిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా మంత్రులు తమ సొంత శాఖలతో బాటు ఈ అదనపు బాధ్యతలు కూడా చూస్తూ సభలో ప్రతిపక్ష సభ్యులకు సమాధానాలు ఇస్తారన్న మాట.

ముఖ్యమంత్రి వద్ద ఉండే సాధారణ పరిపాలన శాఖ బాధ్యతలు ఈ అసెంబ్లీ జరిగినన్నాళ్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి అప్పగించారు. అలాగే శాంతి భద్రతలను హోం శాఖ చూస్తున్న మంత్రి తానేటి వనితను అప్పగించారు. ఇక న్యాయశాఖకు సంబంధించి అంశాల్ని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు కేటాయించారు. ఎన్నారైల సాధికారిత సంబంధాల అంశాన్ని ప్రభుత్వ సంస్ధలకు సంబంధించి అంశాల్ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు అప్పగించారు. ఇపుడు ఈ మంత్రులు చేయాల్సిన పని ఏంటి అంటే తమ శాఖలతో పాటు ఈ శాఖలను కూడా అధ్యయనం చేయాలి. అదే విధంగా ఆయా శాఖలకు సంబంధించి విపక్షాలు ప్రశ్నలు సంధిస్తే వాటిని వారే లేచి అసెంబ్లీలో జవాబు చెప్పాలి. అంతే కాదు బిల్లులను కూడా ఆయా శాఖలకు సంబంధించి కూడా సభలో వారే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇపుడు ఈ మంత్రులకు అదనపు భారంతో బాటు అదనపు శ్రమ కూడా ఉంటుంది.. అసలే విపక్షాలు వేడి మీద ఉంటాయి. దాంతో వారు సంధించే ప్రశ్నలకు సరైన తీరున జవాబులు చెప్పాలి. తమ శాఖల కంటే ఎక్కువగా వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ నాల్రోజులు సమర్థంగా తమ బాధ్యతలు నెరవేరిస్తే వారికి సీఎం వద్ద మంచి మార్కులు పడతాయి…కాబట్టి ఈ గౌరవం కోసం మంత్రలు సైతం పోటీ పడతారు. ఇక జగన్ తన శాఖలు అప్పగించిన మంత్రులను వారంతా ఆయనకు మరింత దగ్గర అన్న భావన కూడా ఉంది. ఇక సభలో సమర్థంగా మాట్లాడేవారికి టీవీల్లో మంచి ప్రయారిటీ ఉంటుంది. చేనెల్స్ ఆయా వాదనలను చూపిస్తూ వారి రేటింగ్స్ పెంచుకుంటారు… ఇక తమ సమర్థతను నిరూపించుకునేందుకు మంత్రులకూ ఇదో అవకాశం

ఇక ఈ శాఖల కేటాయింపు మీద ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంవో నుంచి అసెంబ్లీ కార్యదర్శికి సమాచారం పంపారు. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లు చేస్తున్న కార్యదర్శి ఈ అంశాల ఆధారంగా సంబంధిత వ్యవహారాల్ని ఆయా మంత్రులతో సమన్వయం చేసుకోవాల్సిఉంటుంది అన్న మాట. ఇక ఈసారి బడ్జెట్ సమావేశాలు కొద్ది రోజులు మాత్రమే జరగబోతున్నాయి.

Latest News