Site icon vidhaatha

Leopard: ఇక్రిశాట్ లో మరో చిరుత!

Leopard: హైదరాబాద్ పటాన్ చెరులోని ఇక్రిశాట్ క్యాంపస్ లో రెండు రోజుల క్రితం ఓ చిరుతను బంధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు క్యాంపస్ లో మరో చిరుత సంచరిస్తున్నట్లుగా సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు రెండో చిరుతను బంధించేందుకు ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. తాజాగా ఇక్రిశాట్ క్యాంపస్ లో బంధించిన చిరుతపులిని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో వైద్య పరీక్షల అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ ఫారెస్టులో వదిలారు. ఈ మగ చిరుత వయసు ఆరేళ్ల ఉంటుందని తెలిపారు.

క్యాంపస్‌లో రెండు చిరుతపులులు కనిపించాయని ఇక్రిశాట్ సిబ్బంది తెలియజేయడంతో తెలంగాణ అటవీ శాఖ సహాయక చర్యను ప్రారంభించింది. అటవీశాఖ అధికారులు 30 నుంచి 40 నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి మేకలను ఎరగా వేసి రెండు ట్రాప్ బోనులను ఏర్పాటు చేశారు. క్యాంపస్ లోని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Exit mobile version