విధాత : ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండోసారి తల్లి కాబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విరాట్-అనుష్కలు 2017లో వివాహబంధంతో ఒక్కటవ్వగా, వారికి 2021లో వామికా తొలి సంతానంగా జన్మించింది. అనుష్క శర్మ రెండోబిడ్డకు జన్మనివ్వరున్నారన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది. ఇటీవల ఆంగ్ల మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి.
ముంబైలో ఓ ప్రసూతి ఆసుపత్రి వద్ద విరాట్ తో కలిసి ఆమె కనిపించారని, ఫోటోలు తీయొద్దని మీడియాని అభ్యర్థించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. అదిగాక ఈ మధ్య అనుష్క కూడా మీడియాలో కనిపించకపోవడం కూడా అనుష్క మళ్లీ తల్లి కాబోతుందన్న వార్తలకు బలం చేకూరిందని నెటిజన్లు భావిస్తున్నారు.
తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్‌స్టా స్టోరీ మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. అభిప్రాయాలు, తీర్పుకు సంబంధించిన కొటేషన్‌ను ఆమె మెసేజ్ చేసింది. అభిప్రాయలు వ్యక్తిగత దృక్కోణం నుంచే వస్తాయని, మీరు అర్థం చేసుకున్నప్పుడు వాటి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుందని రాసి ఉన్న ఫోటోను ఆమె షేర్ చేసింది. ఈ మేసేజ్ అనుష్క మళ్లీ తల్లి కాబోతుందన్న ఫ్రచారానికి బలం చేకూరుస్తుందని నెట్టిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు.