Artigen Employees
హైదరాబాద్, విధాత: విద్యుత్ సంస్థలలో పని చేస్తున్న ఆర్టిజెన్ ఉద్యోగులు బేషరత్తుగా సమ్మె విరమించారు. దీంతో సమ్మెలో ఉన్న ఉద్యోగులంతా విధులకు హాజరు కావాలని నిర్ణయించారు.
సమ్మెల్లో ఉన్న ఉద్యోగులందరూ విధుల్లోకి హాజరు కావాలని విద్యుత్ సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. సమ్మెల్లో పాల్గొన్న కొంత మంది ఉద్యోగులను విద్యుత్ సంస్థలు టెర్మినేట్ చేశాయి.
సమ్మె విరమించాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో టెర్మినేట్ అయిన ఆర్టిజెన్ ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకోవాలని సీఎండీ ప్రభాకర్ రావు కు ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగుల విజ్ఞప్తికి సీఎండీ ప్రభాకర్‌రావు సానుకూలంగా స్పందించారు.