Philippines
విధాత: పరిమితికి మించి ప్రమాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడి 26 మంది జలసమాధి అయ్యారు. ఫిలిప్పీన్స్ రాజధాని సమీపంలోని ఓ సరస్సులో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. బలమైన గాలుల కారణంగా నౌక మునిగిపోయిందని, 40 మందిని రక్షించామని కోస్ట్ గార్డ్ అధికారులు చెప్పారు.
మునిగిన నౌకకు 40 మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం ఉండగా, ఎంతమందిని ఎక్కించారనేది తెలియడం లేదని తెలిపారు. ప్రయాణికుల జాబితాలో మాత్రం కేవలం 22 మంది పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. గాలింపు, రెస్క్యూ, రిట్రీవల్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
పడవ కెప్టెన్, ఆపరేటర్‌పై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు.
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో మార్చిలో ఓ నౌకలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 33 మంది మరణించారు. ఈ ఏడాది జరిగిన పడవ ప్రమాదంలో ఇది రెండవదని అధికారులు తెలిపారు.