Site icon vidhaatha

Delhi | నడి రోడ్డుపై గుంత‌లో మునిగిన ఆటో.. డ్రైవ‌ర్ మృతి!

విధాత‌: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు నీరు నిలిచిన ఓ గుంత‌పై నుంచి ఆటోను న‌డిపించ‌డంతో అది మునిగిపోయిన ఘ‌ట‌న దిల్లీ (Delhi) లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో డ్రైవ‌ర్ ప్రాణాలు కోల్పోయాడు.

అటుగా వెళ్తున్న ఓ వ్య‌క్తికి మృతదేహం క‌నిపించ‌డంతో ఈ ప్ర‌మాదం వెలుగులోకి వ‌చ్చింది. ఈశాన్య దిల్లీలోని హ‌ర్ష విహార్ ప్రాంతంలో జ‌ర‌గిన ఈ ఘ‌ట‌ను సంబంధించి పోలీసులు తెలిప‌న ప్ర‌కారం… గురువారం సాయంత్రం 3:30కి ఓ వ్య‌క్తి మృత‌దేహం నీటిపై తేలుతోంద‌ని పోలీసుల‌కు స‌మాచారం వ‌చ్చింది.

దీంతో అక్క‌డ‌కి వెళ్లిన పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని ద‌ర్యాప్తు చేశారు. అత‌డు ఆటో డ్రైవ‌ర్ అని తెలుసుకున్నారు. ప‌క్క‌నే ఫ్లైఓవ‌ర్ కోసం త‌వ్విన గుంత ఉండ‌టంతో అందులో మునిగిపోయి ఉంటార‌నుకుని గాలింపు చేప‌ట్టారు.

అందులో నుంచి ఆటోను బ‌య‌ట‌కు తీశారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన గుంత‌ను ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న ఫ్లైఓవ‌ర్ కోసం త‌వ్వారు. రెండు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వల్ల ఆ నీరు అంతా గుంత‌లోకి నిండిపోయింది.

దీని లోతును అంచ‌నా వేయ‌ని మృతుడు అజిత్ శ‌ర్మ దానిపై నుంచి ఆటోను న‌డిపించ‌డంతో ఈ ఘోరం జ‌రిగింది. బాధితుడు గురువారం రాత్రి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాక‌పోవ‌డంతో అదే రోజు రాత్రి ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి న‌లుగురు పిల్ల‌లు, భార్య ఉన్నారు.

Exit mobile version