Medak | ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

Medak | ఉపాధ్యాయ స్థానం.. మహోన్నతం కలెక్టర్ రాజర్షి షా విధాత, మెదక్ బ్యూరో: ప్రతి మనిషి జీవితంలో ఉపాధ్యాయుడు ఉన్నాడని, ఆ స్థానం మహోన్నత మైనదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్మానించారు. కార్యక్రమానికి కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుడు చూపిన దారిలో పయనించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు. సభ్యత సంస్కారం […]

  • Publish Date - September 5, 2023 / 02:22 PM IST

Medak |

  • ఉపాధ్యాయ స్థానం.. మహోన్నతం
  • కలెక్టర్ రాజర్షి షా

విధాత, మెదక్ బ్యూరో: ప్రతి మనిషి జీవితంలో ఉపాధ్యాయుడు ఉన్నాడని, ఆ స్థానం మహోన్నత మైనదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్మానించారు.

కార్యక్రమానికి కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుడు చూపిన దారిలో పయనించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు. సభ్యత సంస్కారం నేర్పేది ఉపాధ్యాయులేనని, వారు చెప్పే సూచనలు, సలహాలు పాటించాలన్నారు.

తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే స్థానం ఉందని, అంత గొప్ప స్థానాన్ని అలంకరించిన ఉపాధ్యాయుల కు మనం సముచిత గౌరవం కల్పించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు మనబడి’ కార్యక్రమం ద్వారా అనేక పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యాభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు.

అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్ , ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఇఓ రాధా కిషన్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లిఖార్జునగౌడ్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest News