Badrinath |
భక్తుల కోసం బద్రీనాథ్ ఆలయ ద్వారాలను తెరిచారు. గురువారం ఉదయం 7.10 గంటలకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ద్వారాలను తెరువగా.. అఖండ జ్యోతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దాదాపు 20వేల మంది భక్తులు బద్రీనాథుడి దర్శనం కోసం తరలివచ్చారు.
భక్తుల జయజయధ్వానాలు, ఆర్మీ బ్యాండ్‌తో బద్రీనాథ్‌లో పండగ వాతావరణం నెలకొన్నది. తలుపులు తెరువనున్న సందర్భంగా ఆలయాన్ని బంతిపూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
మరో వైపు బద్రీనాథ్ హైవేలోని కంచన్ గంగా, రాడాంగ్ బ్యాంచ్‌లో మంచువర్షం నిలిచిపోయింది. అలకనంద నది ఒడ్డున పలు ప్రాంతాల్లో మాత్రమే మంచువర్షం కురుస్తన్నది.
ఇక 2013లో ప్రకృతి విపత్తులో కొట్టుకుపోయిన లంబగడ మార్కెట్‌లో మరోసారి దుకాణాలు తెరుచుకోవడం మనా గ్రామస్తుల సందడి మొదలైంది. బద్రీనాథ్‌కు చేరుకున్న భక్తులు చాలా మంది మనా గ్రామాన్ని సందర్శించారు.
#WATCH | Uttarakhand: Devotees gather outside Badrinath temple. The portals of Badrinath Dham will open at 7.10 am. The temple has been decorated with 15 quintals of marigold flowers. pic.twitter.com/us3PIcbXRT
— ANI (@ANI) April 27, 2023