విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రూ. 3 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీ ఇవ్వాలని కోర్టు సూచించింది.
రామచంద్రభారతిపై బంజారాహిల్స్ పీఎస్‌లో 2 కేసులు నమోదయ్యాయి. నకిలీ ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు కలిగి ఉన్నారని రెండు వేర్వేరు కేసులు పోలీసులు నమోదు చేశారు. జైలు నుంచి రాగానే రామచంద్రభారతిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నది.
నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు 5 కేసులు నమోదు చేశారు. ఆయనపై డెక్కెన్ కిచెన్ లీజు విషయంలో, బెదిరింపు కేసులు కూడా వేర్వేరు కేసులు నమోదు చేశారు. నందకుమార్ ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నాడు.