నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్న తెలిసిందే. ఆయన చేసే కామెంట్స్ నెట్టింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య తాజాగా భగవంత్ కేసరి చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలయ్య ఆసక్తికర కామెంట్స్ చేయగా, ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. భగవంత్ కేసరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందిస్తుండగా, చిత్రాన్ని సాహు గరపాటి, హరీష్ పెద్ది లు నిర్మిస్తున్నారు. చిత్రంలో బాలయ్యకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, కూతురిగా శ్రీలీల నటిస్తుంది.
చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన బాలయ్య.. శ్రీలీల, మోక్షజ్ఞలపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిత్రంలో శ్రీలీల ప్రతి సారి నన్ను చిచ్చా అని పిలుస్తూ ఉండేది. చిచ్చా అంటే పగిలిపోద్ది అంటూ ఉంటాను అని చెప్పుకొచ్చారు.అయితే ‘శ్రీలీలతో నెక్ట్స్ హీరోయిన్‌గా చేద్దామని అనుకున్నా.. ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పగా, గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని మోక్షజ్ఞ నన్నే అన్నాడు.. ఇంట్లో నేను కుర్ర హీరోని రావడానికి రెడీగా ఉన్నా.. నువ్ ఆమెతో చేస్తాను అంటావా? అని నాకే వాడు వార్నింగ్ ఇచ్చాడని బాలయ్య చెప్పుకొచ్చాడు.
భగవంత్ కేసరిని ఇంకా పూర్తిగా చూడలేదు. చూసింది చాలా తక్కువ. ఇంకెంతో దాచాం. సినిమాకి సంబంధించిన విషయాలని అంచెలంచెలుగా చూపిస్తాం. సినిమాని చూపిస్తే అభిమానులని ఆపడం చాలా కష్టమని చెప్పిన బాలయ్య.. సవాళ్లని స్వీకరించడం నాకు అలవాటు. మా నాన్న నుండి ఈ సవాళ్లని స్వీకరించడం నేర్చుకున్నాను. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. కథ కూడా ఫైనలైజ్ అయింది. అందరం కలిసి సమిష్టా పని చేస్తే ఏదైన సాధ్యం అవుతుందని పేర్కొన్నారు బాలయ్య. ఇక ఆయన తనయుడు మోక్షజ్ఞ సినిమాకి సంబంధించి గత కొన్నాళ్లుగా అనేక వార్తలు వస్తుండగా, పూర్తి క్లారిటీ ఇవ్వడం లేదు.