భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం భగవంత్ కేసరి. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదలైంది. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల కథానాయికలుగా నటించారు. వరుస హిట్స్‌తో మంచి జోష్ మీదున్న అనీల్ రావిపూడి ఈ సినిమా తెరకెక్కించారు. విడుదలైన అన్ని చోట్ల కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలానే చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. శ్రీలీల పాత్ర కోసం ముందుగా కృతి శెట్టిని సంప్రదించారని, ఆమె నో చెప్పడంతో శ్రీలీలకి ఆ ఛాన్స్ దక్కిందనే టాక్ నడుస్తుంది.
ఇక భగవంత్ కేసరి సినిమాలో చిన్నప్పటి శ్రీలీలా క్యారెక్టర్ లో నటించి తనదైన గుర్తింపు పొందిన అమ్మాయిపై అందరి దృష్టి పడింది. ఆ అమ్మాయి ఎవరు అని తెగ ఆరాలు తీస్తున్నారు. చిన్నారి పాప పేరు నైనిక కాగా ఆమెను మిన్ను అని ముద్దుగా పిలుస్తుంటారు. సంగారెడ్డిలో అక్టోబర్ 2 వ తేదీన రవికాంత్, ప్రియ అనే దంపతులకు నైనిక జన్మించింది. నటనపై ఎక్కు ఇంట్రెస్ట్ ఉండడంతో డబ్ స్మాష్, టిక్ టాక్ లాంటి వాటిలో అనేక వీడియోలు చేస్తూ వచ్చింది. వీడియోలో చిన్నారి చాలా బబ్లీగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉండటం చూసి ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ యూనిట్ ఖుషి అనే పాత్ర కోసం ఆమెను ఎంపిక చేశారు. ఈ సీరియల్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కి అందరు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఆమెకి మూడు యాడ్స్‌లో నటించే అవకాశం కూడా దక్కింది.
అయితే ఇటీవల ఈ పాప పేరు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీలా చిన్నప్పటి పాత్ర కోసం నైనికని ఎంపిక చేశారు. భగవంత్ కేసరి సినిమా ఈవెంట్ లో కూడా చిన్నారి క్యూట్‌గా మాట్లాడి ప్రేక్షకులందరు తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇక సినిమా రిలీజ్ తర్వాత పాపకి మంచి పాపులారిటీ దక్కింది. సినిమాలో ముఖ్య పాత్ర పోషించడం, అందులో అద్భుతంగా నటించడంతో నైనిక గురించి అందరు తెగ వెతికేస్తున్నారు. గతంలో ఆమె చేసిన సీరియల్స్,రీల్స్ వీడియోలు ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. రానున్న రోజులలో నైనిక మరిన్ని సినిమా అవకాశాలు దక్కించుకోవడం ఖాయం అని అంటున్నారు.