Balineni Srinivas Reddy | బాలినేని మెత్తబడినట్లేనా.. మళ్లీ ఎప్పటిలా యాక్టివ్ అవుతారా

Balineni Srinivas Reddy విధాత‌: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి పాత్ర గురించి ఆయన ఉనికి, ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమధ్యనే ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ పదవి నుంచి వైదొలిగిన బాలినేని గత కాంగ్రెస్ హయాంలో వైఎస్ కేబినెట్లో మంత్రిగా ఉండేవారు. వైఎస్ మరణం తరువాత ఆయన పదవులు వదులుకుని జగన్ వెంట నడిచారు. పార్టీని నడిపిస్తూ, ఖర్చులు, బాధ్యతలు చూస్తూ వస్తున్నారు. అయితే పార్టీని మోయడానికి, గెలిపించడానికి […]

  • Publish Date - June 2, 2023 / 10:33 AM IST

Balineni Srinivas Reddy

విధాత‌: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి పాత్ర గురించి ఆయన ఉనికి, ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమధ్యనే ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్ పదవి నుంచి వైదొలిగిన బాలినేని గత కాంగ్రెస్ హయాంలో వైఎస్ కేబినెట్లో మంత్రిగా ఉండేవారు. వైఎస్ మరణం తరువాత ఆయన పదవులు వదులుకుని జగన్ వెంట నడిచారు.

పార్టీని నడిపిస్తూ, ఖర్చులు, బాధ్యతలు చూస్తూ వస్తున్నారు. అయితే పార్టీని మోయడానికి, గెలిపించడానికి పనికొచ్చిన బాలినేని మంత్రిగా పనికిరారు అనుకున్నారో ఏమో కానీ ఆయనకు పదవి ఇవ్వకుండా ఆదిమూలపు సురేష్ కు పదవి ఇవ్వడంతో బాలినేని(Balineni Srinivas Reddy) అలిగి మొత్తం మూడు జిల్లాల కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి నేను ఒంగోలు ఎమ్మెల్యేగా ఉంటాను చాలు అనేసారు.

బాలినేని గానీ సైడ్ ఐతే ఒంగోలులో వైసిపిని నడిపించేవాళ్ళు లేరు.. అందుకే జగన్ ఆయన్ను మళ్ళీ పిలిపించుకుని నిన్న మాట్లాడారు.. అలక తీర్చేందుకు ప్రయత్నించారు. చీరాల, పరుచూరి, అడ్డంకి, కొండెపి టికెట్స్ ఎవరికీ ఇవ్వాలి… సిట్టింగ్స్ ను కొనసాగించాలా లేదా అనే పలు అంశాల మీద చర్చించారు.

మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అనేదానికి మాత్రం నువ్వు నావాడివి… అందుకే ఇవ్వలేదు అనే సమాధానం మాత్రం బాలినేనిని బాగా చిరాకు తెప్పించిందని అంటున్నారు. ఇక వైవి సుబ్బారెడ్డి కూడా తనను ఇబ్బంది పెడుతున్నట్లు బాలినేని చెప్పగా ఇక ముందు అవేం ఉండవ్.. నీకు స్వేచ్ఛ ఇస్తున్నాను మళ్ళీ పార్టీ కోసం పని చేయాలి అని చెప్పారు.

ఈ పూటకు బాలినేని మెత్తబడినప్పటికీ మళ్ళీ మూడు జిల్లాల ఇన్‌చార్జిగా ఉండాలని జగన్ అడిగిన మాటను మాత్రం చిరునవ్వుతో తిరస్కరించారు అని అంటున్నారు. మొత్తానికి ఎన్నికలు వస్తున్నవేళ జగన్ పార్టీలో గ్యాప్స్ ఫీల్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

Latest News