Karimnagar: అర్ధరాత్రి బండి సంజయ్‌ అరెస్ట్‌.. ఉద్రిక్తత

బొమ్మల రామారం స్టేషన్ కు తరలింపు బిజెపి శ్రేణులు అడ్డగింత.. ఉద్రిక్తత లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు విధాత: తన అత్తగారి కర్మ కార్యకమాల్లో పాల్గొనేందుకు కరీంనగర్ వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం గజ్వేల్ మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్ అరెస్టు.. తరలింపును బిజెపి కార్యకర్తలు అడ్డుకున్న క్రమంలో కొంత ఉద్రిక్తత […]

  • Publish Date - April 5, 2023 / 02:30 AM IST

  • బొమ్మల రామారం స్టేషన్ కు తరలింపు
  • బిజెపి శ్రేణులు అడ్డగింత.. ఉద్రిక్తత
  • లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు

విధాత: తన అత్తగారి కర్మ కార్యకమాల్లో పాల్గొనేందుకు కరీంనగర్ వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం గజ్వేల్ మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్ అరెస్టు.. తరలింపును బిజెపి కార్యకర్తలు అడ్డుకున్న క్రమంలో కొంత ఉద్రిక్తత హైడ్రామా చోటుచేసుకుంది.

తనను ఏ కేసులో ఎందుకు అరెస్టు చేస్తున్నారని నోటీసు వారెంట్ ఉందా అంటూ బండి సంజయ్ తనను అరెస్ట్ చేసిన పోలీసులను ప్రశ్నించారు. 151 సీఆర్పి, ది ప్రివెన్టివ్ సెక్షన్ల కింద అరెస్ట్ చేశామంటూ ఆయనను బలవంతంగా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాటలో సంజయ్ మూతికి గాయం అయిందంటూ కార్యకర్తల ఆందోళన వ్యక్తం చేశారు.

బండి సంజయ్‌ను అరెస్టు చేసి తిమ్మాపూర్ మీదుగా తీసుకెళుతుండగా ఎల్ఎండీ సమీపంలో పోలీస్ వాహనం మొరాయించింది. దీంతో మరో వాహనాన్ని తెప్పించి సంజయ్‌ను అందులోకి ఎక్కించి తీసుకెళ్లారు. పదవ తరగతి పేపర్ లీకేజీ కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ఎంపీగా ఉన్న తనను అర్ధరాత్రి వేళ ముందస్తు వారంట్ కూడా లేకుండా అరెస్ట్ చేసి ఎంపీగా తన హక్కులను హరించినట్లుగా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అక్రమ అరెస్టు చేశారంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకులపై తాను బుధవారం ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకునేందుకు తనను అక్రమంగా అరెస్టు చేశారు అంటూ బండి సంజయ్ ఆరోపించారు. తనను జైల్లో పెట్టిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నించడం ఆపేది లేదన్నారు.

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి తలుపులు వేసి తన భర్త సంజయ్‌ని అరెస్టు చేయడంపై సంజయ్ భార్య అపర్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హార్ట్ పేషెంట్ అని టాబ్లెట్లు కూడా వేసుకొనివ్వకుండా అరెస్టు చేసి బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సీపీని అడిగినా చెప్పలేదన్నారు. తన అత్తగారి దశదినకర్మ కోసం సంజయ్ కరీంనగర్‌కు వెళ్లారు. అసలు మా నాన్నను ఎందుకు అరెస్టు చేశారో పోలీసులు చెప్పలేదంటూ సంజయ్ కొడుకు భగీరథ తెలిపారు.

బండి సంజయ్ అరెస్టు విషయం తెలుసుకున్న బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున బొమ్మలరామరం పోలీస్ స్టేషన్కు చేరుకుంటుండంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్ ముందు బైఠాయించిన బిజెపి కార్యకర్తలు సీఎం కేసీఆర్ డౌన్డౌన్ అంటూ లిక్కర్ రాజ్యం లికుల రాజ్యం.. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

బండి సంజయ్ అరెస్టును బిజెపి కేంద్ర రాష్ట్ర నాయకత్వం సీరియస్గా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర పార్టీ నాయకత్వం బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. బిజెపి శ్రేణుల నిరసనలను అడ్డుకునేందుకు రాష్ట్రంలో ఎక్కడికక్కడే పోలీసులు ఆ పార్టీ నాయకులను కార్యకర్తలను ముందస్తు అరెస్టులకు చేస్తున్నారు.

మొత్తం మీద ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన ఉన్న నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ నాయకత్వం సీరియస్గా తీసుకుంటుంది. బిజెపి నేత బిఎల్ సంతోష్ బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.

Latest News