అఖిలమ్మా.. ఇదేం తీరమ్మా.. బకాయి కోసం బ్యాంకు సిబ్బంది ధర్నా!

విధాత‌: పాపం.. ఏ ముహూర్తాన మంత్రిగా పదవి చేపట్టిందో గానీ భూమా అఖిలప్రియకు ఆ పదవి కల ముగియగానే సమస్యలు చుట్టు ముడుతున్నాయ్. తమ తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి కాలంలో చేసిన తప్పులు ఇప్పుడు అఖిలప్రియకు చుట్టుకున్నాయ్. బకాయిలు చెల్లించక పోవడంతో బ్యాంకు సిబ్బంది వచ్చి అఖిలప్రియ ఇంటి ముందు ధర్నా చేసే వరకూ వెళ్లింది. భూమా నాగిరెడ్డి బతికున్న రోజుల్లో నంద్యాల ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకొని ‘జగత్ డెయిరీ’ ప్రారంభించారు. ఇందుకుగాను […]

  • Publish Date - December 14, 2022 / 04:00 PM IST

విధాత‌: పాపం.. ఏ ముహూర్తాన మంత్రిగా పదవి చేపట్టిందో గానీ భూమా అఖిలప్రియకు ఆ పదవి కల ముగియగానే సమస్యలు చుట్టు ముడుతున్నాయ్. తమ తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి కాలంలో చేసిన తప్పులు ఇప్పుడు అఖిలప్రియకు చుట్టుకున్నాయ్. బకాయిలు చెల్లించక పోవడంతో బ్యాంకు సిబ్బంది వచ్చి అఖిలప్రియ ఇంటి ముందు ధర్నా చేసే వరకూ వెళ్లింది.

భూమా నాగిరెడ్డి బతికున్న రోజుల్లో నంద్యాల ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకొని ‘జగత్ డెయిరీ’ ప్రారంభించారు. ఇందుకుగాను రూ. 80 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకుకు తాకట్టు పెట్టారు. ఆయన ఉన్నన్నీ రోజులు వ్యాపారులు ప్రతీ నెలా కిస్తీలు చెల్లించారు. అయితే ఆయన మరణానంతరం పరిస్థితులు తారుమారయ్యాయి.

ఆ తరువాత అఖిల ప్రియ కిడ్నాప్ కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది. ఆ తరువాత ఆమె జైలుపాలై పలు అవమానాలూ ఎదుర్కొంది. ఇక ఆమె ఆ కేసుల్లోంచి బయటపడే ప్రయత్నాల్లో ఈ బ్యాంకు కిస్తీలు కట్టడం ఆపేసింది.

‘జగత్ డెయిరీ’ పేరిట తీసుకున్న మొత్తం రుణం దాదాపు 16 కోట్లకు చేరింది. దీంతో ‘యూనియన్ బ్యాంక్’ అధికారులు అఖిలప్రియకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆమె స్పందించలేదు. బ్యాంకు రుణం తీర్చలేదు. దీంతో బ్యాంకు ఉద్యోగులు అఖిలప్రియకు సంబంధించిన‌ ప్లకార్డులు పట్టుకుని అఖిలప్రియ ఇంటి ఎదురుగా బ్యాంకు ఉద్యోగులు ధర్నాకు దిగారు.

‘బ్యాంక్ మనీ పబ్లిక్ మనీ.. మా బకాయిలు చెల్లించండి.. సగర్వంగా జీవించండి.. అంటూ నినాదాలు రాసుకొని వచ్చి ప్లకార్డులు ప్రదర్శించి ధర్నాకు దిగారు. దీంతో దెబ్బకు పరువు పోతుందని భావించిన అఖిలప్రియ బ్యాంకు అధికారులను ఇంట్లోకి పిలిచి కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నట్లు సమాచారం.