విధాత: ఎంత ఆకలేసిందో ఏమో గానీ ఒక ఎలుగుబంటి (Bear) ఇంటి కిటికీ లోంచి దూరి తనకు కావల్సింది తినేసింది. ఆఖరికి కిందకి దిగి పోదామనేసరికి చిన్న పిల్లాడిలా ఆ ఎత్తును చూసి జంకింది. కడుపుబ్బా నవ్వించిన ఈ ఘటన అమెరికాలోని స్టీమ్‌బోట్ స్ప్రింగ్స్ నగరంలో జరిగింది. స్థానికుడు ఒకరు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీయడంతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
వీడియోలో ఉన్న దాని ప్రకారం.. మొదట ఇంటి పెరట్లోకి వచ్చిన ఎలుగుబంటి.. కులాసాగా తన ఇంట్లోకే వచ్చినట్లు ఆ గోడ పట్టుకుని మొదటి అంతస్తు వరకు వెళ్లింది. అక్కడ తెరిచి ఉన్న కిటికీ ద్వారా వంటింట్లోకి వెళ్లి ఆ ఇంట్లో వాళ్లు వండుకున్న పోర్క్ ముక్కల్ని హాంఫట్ చేసింది.
Curious bear climbs into the house in Colorado #breaking pic.twitter.com/AwkOaKCBkw
— KASİDE (@zakkumec) June 18, 2023
భద్రతా సిబ్బంది లోపలకు వెళ్లి అన్ని కిటికీల తలుపులు తీయడంతో.. కింది అంతస్తు కిటికీలోంచి దూకి అడవిలోకి వెళ్లిపోయింది. ఎలుగుబంటి అతిథి తన ఇంటిని ఎక్కువ పాడుచేయలేదు కానీ పార్టీ కోసం తయారుచేసిన పోర్క్‌ను భోంచేసేసిందని ఇంటి యజమాని వాపోయారు.