బెంగళూరు స్కూళ్ల‌కు బాంబు బెదిరింపు

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోని ప‌లు పాఠ‌శాల‌ల‌కు శుక్ర‌వారం బాంబు బెదిరింపు హెచ్చ‌రిక‌లు అందాయి. గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఈ మేర‌కు ఆయా స్కూళ్ల‌కు ఇ మెయిల్స్ వ‌చ్చాయి.

  • Publish Date - December 1, 2023 / 06:56 AM IST

  • గుర్తుతెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఇ మెయిల్
  • 13 స్కూళ్ల‌లో విద్యార్థులు, సిబ్బందిని ఖాళీ
  • చేయించిన పోలీసు అధికారులు


విధాత‌: క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోని ప‌లు పాఠ‌శాల‌ల‌కు శుక్ర‌వారం బాంబు బెదిరింపు హెచ్చ‌రిక‌లు అందాయి. గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి ఈ మేర‌కు ఆయా స్కూళ్ల‌కు ఇ మెయిల్స్ వ‌చ్చాయి. బెదిరింపు ఇ మెయిల్స్‌తో భ‌యాందోళ‌న‌కు గురైన స్కూళ్ల యాజ‌మాన్యాలు ఈ విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాయి. వెంట‌నే స్పందించిన పోలీసులు ఆయా స్కూళ్ల‌లోని విద్యార్థులు, సిబ్బందిని బ‌య‌ట‌కు పంపించారు. స్కూళ్ల‌ను ఖాళీ చేయించారు.

బెంగ‌ళూరులోని 13 స్కూళ్ల‌కు బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌పంపారు గుర్తుతెలియ‌ని దుండ‌గులు. బ‌స‌వేశ్వ‌ర్‌న‌గ‌ర్‌లోని విద్యాశిల్ప‌, న‌పెల్ స‌హా ఏడు స్కూళ్ల‌కు తొలుత బాంబులు ఉన్న‌ట్టు ఇ మెయిల్స్ అందాయి. త‌ర్వాత మ‌రికొన్ని విద్యాసంస్థ‌ల‌కు కూడా ఇదే త‌ర‌హాలో బెదిరింపు ఇ మెయిల్స్ పంపారు దుండ‌గులు. పోలీసులు ఆయా స్కూళ్ల‌ను ఖాళీ చేయించి బాంబులు, అనుమానాస్ప‌ద వ‌స్తువుల కోసం గాలిస్తున్నారు. అలాగే మెయిల్స్ పంపిన వారి ఆచూకీ తెలుసుకుంటున్నారు. కేసు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Latest News