Bengaluru Terror Attack
విధాత: దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో ఉగ్ర దాడులకు జరుగుతున్న కుట్రలను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ భగ్నం చేసింది. ఈ కుట్రకు సంబంధించి ఐదుగురు అనుమానితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సభ్యుల వద్ద ఉన్న పేలుడు పదార్థాలు, మొబైల్స్, ఇతర సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఉగ్ర కుట్రకు సంబంధించి మరో ఐదుగురు అనుమానితుల కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
5 suspected terrorists planning explosion held in Bengaluru
Read @ANI Story | https://t.co/QURAnScTsj#CCB #Bengaluru pic.twitter.com/oF6tDKhD84
— ANI Digital (@ani_digital) July 19, 2023
బెంగళూరులోని పలు ఏరియాల్లో ఉగ్ర దాడులకు కుట్ర జరుగుతోందని సీసీబీకి పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ ఐదుగురిని సుహైల్, ఓమర్, జహీద్, ముదాసీర్, ఫైజల్‌గా గుర్తించారు. వీరంతా బెంగళూరుకు చెందిన వారు కాగా, వయసు 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉంటుంది.
అయితే ఇవాళ ఉదయం అరెస్టు అయిన ఐదుగురు వ్యక్తులకు 2017లో జరిగిన ఓ మర్డర్ కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 18 నెలల పాటు బెంగళూరు సెంట్రల్ జైల్లో జైలు జీవితాన్ని గడిపారు. 2019లో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ మర్డర్ కేసులో బెంగళూరులోని సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో ఈ ఐదుగురికి ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, ఆ సమయంలోనే పేలుడు పదార్థాలు ఎలా తయారు చేయాలని, ఎలా దాడులు చేయాలని నేర్చుకున్నట్లు సమాచారం