Site icon vidhaatha

ఆకట్టుకున్నభగవంత్‌ కేసరి వర్కింగ్‌ స్టిల్స్‌

విధాత : బాలకృష్ణ, కాజల్‌, శ్రీలీలలు నటించిన భగవంత్‌ కేసరి సినిమా ఈ నెల 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో తెలంగాణ యాసతో బాలకృష్ణ తొలిసారి నటిస్తుండటం విశేషం. సినిమా ప్రమోషన్‌లో భాగంగా వరంగల్‌లో ఇటీవలే ఈ సినిమా ఫ్రీరిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసిన ప్రమోషన్ సాంగ్‌లో విజ్జీ పాపగా చిచ్చా అంటూ బాలకృష్ణతో శ్రీలీల వినాయక చవితి నేపధ్యంతో కూడిన పాట ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది.


 


అలాగే తెలంగాణ పండుగ బతుకమ్మతో కూడిన పాట,  కథాపరంగా బాలకృష్ణకు, శ్రీలీలకు మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా కనిపించాయి. ఇప్పుడు సినిమా వర్కింగ్‌ స్టిల్స్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మొత్తం మీద భావోద్వేగం..హిరోయిజం..గ్లామర్‌, పాటల పరంగా సినిమా బాగా రూపొందిందని, ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్‌ ధీమాగా ఉంది. మరి ప్రేక్షకులు భగవంత్‌ కేసరిని ఎంతమేరకు ఆదరిస్తారో చిత్రం విడుదలైతేగాని తేలనుంది.

Exit mobile version