Bigg Boss 7 | బిగ్‌బాస్ కొత్త టీజ‌ర్.. కంటెస్టెంట్స్ గుండెల్లో మొద‌లైన టెన్ష‌న్

Bigg Boss 7 | బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న రియాల్టీ షోల‌లో బిగ్ బాస్ కూడా ఒక‌టి. తెలుగులో కూడా ఈ షోకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టికే ఆరు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వ‌ర‌లో సీజ‌న్ 7 కూడా జ‌రుపుకోనుంది. అయితే ఈ షో గ‌త సీజ‌న్స‌కి మించి ఉంటుంద‌ట‌. ఇప్ప‌టికే షోకి సంబంధించి ప‌లు ప్రోమోలు విడుద‌ల కాగా, ఇవి షోపై మ‌రింత అంచ‌నాలు పెంచాయి. కుడిఎడమైతే పొరపాటు […]

  • Publish Date - August 11, 2023 / 11:50 AM IST

Bigg Boss 7 |

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న రియాల్టీ షోల‌లో బిగ్ బాస్ కూడా ఒక‌టి. తెలుగులో కూడా ఈ షోకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టికే ఆరు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వ‌ర‌లో సీజ‌న్ 7 కూడా జ‌రుపుకోనుంది. అయితే ఈ షో గ‌త సీజ‌న్స‌కి మించి ఉంటుంద‌ట‌. ఇప్ప‌టికే షోకి సంబంధించి ప‌లు ప్రోమోలు విడుద‌ల కాగా, ఇవి షోపై మ‌రింత అంచ‌నాలు పెంచాయి.

కుడిఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటూ బిగ్ బాస్ సీజన్ 7 తొలి ప్రోమోలో తెలియ‌జేశారు. ఇక రీసెంట్‌గా విడుద‌లైన ప్రోమోలో రమేష్-రాధలను తీసుకొచ్చి.. బిగ్ బాస్ అంటే రొటీన్ రోతకొట్టుడు కాదు, ఈ సారి ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని చెప్పారు. హౌజ్‌లోకి వ‌చ్చి తినడం, కొట్టుకోవ‌డం, రొమాన్స్ లు చేయ‌డం ఇలా మొన్న‌టి వ‌రకు ఉండేది. కాని ఈ సారి మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.

రీసెంట్‌గా విడుదలైన ప్రోమోలో ఓ ఎత్తైన కొండ క‌నిపిస్తుంది.. అక్క‌డ‌ ఇద్దరు ప్రేమికులు.. ప్రేమించిన అబ్బాయి.. కొండ మీద నుంచి కిందపడిపోతుంటే.. కొండపైన ఉన్న అమ్మాయి తన చున్నీ వేసి పట్టుకోమని అబ్బాయికి చెప్పి లాగేందుకు ట్రై చేస్తుంది. నన్ను వదలద్దు రమేష్.. అని అమ్మాయి అనగా.. రాధా నా ప్రాణం నీ చేతుల్లో ఉంది నేను చావను అని అబ్బాయి చెబుతాడు.

మెల్ల‌గా చున్నీతో ఆ అబ్బాయి పైకి వస్తుంటాడు. అప్పుడు నాగ్ ఎంట్రీ ఇచ్చి ఇలాంటి క్లైమాక్స్ మనం చాలా సినిమాల్లో చూసాం కదా .. ఎండింగే మార్చేద్దాం.. ఇది అంతం కాదు ఆరంభం అని అంటాడు. ఎవరి ఊహకి అందని సీజన్.. బిగ్ బాస్ 7. అంతా ఉల్టా పుల్టా అని చెప్ప‌డంతో షోపై క్రేజ్ బాగా పెరిగింది.

బిగ్ బాస్ ఆట ఎలా ఉంటందనేది ఇప్ప‌టికే అంద‌రికి తెలిసిపోయింది. ఎలిమినేషన్స్.. నామినేషన్స్.. విన్నర్.. రన్నర్.. అన్నీ కూడా ముందే తెలిసిపోతున్నాయి. కంటెస్టెంట్స్ కూడా బ‌య‌ట పీఆర్‌ల‌ని పెట్టుకొని ఓట్లు గుద్దిస్తున్నారు.

దీంతో ఆట నాసిరకంగా ఏ మాత్రం ఆసక్తి లేకుండా మారిపోవడంతో.. సీజన్ 7తో మొత్తం సమూలంగా మార్చేశారనే విషయాన్ని నాగార్జున‌ ప్రోమోలో చెప్పకనే చెప్పారు హోస్ట్ నాగార్జున. ఉల్టా.. పుల్టా అంటే.. మీరు ఒకటి ఊహిస్తే అక్కడ మరొకటి జరుగుతుంది.. ఎవరి ఊహలకూ అందనట్టుగా ఈ సీజన్ ఉండబోతుందని అర్ధ‌మ‌వుతుంది. సెప్టెంబ‌ర్ 3 ఆదివారం నుండి క బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కానుంద‌ని అంటున్నారు.

Latest News