Site icon vidhaatha

Biggboss7 | మ‌ళ్లీ ర‌తిక‌, ప్ర‌శాంత్ మ‌ధ్య పులిహోర.. టాస్క్‌లో స‌త్తా చాటిన శోభ‌

బిగ్ బాస్ సీజ‌న్ 7లో మూడో వారం ప‌వ‌ర్ అస్త్ర ఎవ‌రు ద‌క్కించుకుంటారా అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తుండ‌గా, తాజా ఎపిసోడ్‌లో రసవత్తరమైన పోటీ నెలకొంది. ముందు రోజు ఎపిసోడ్‌లో యావ‌ర్‌కి కంటెండ‌ర్‌గా అర్హత లేద‌న్న‌వాళ్లు ముప్పుతిప్పులు పెట్ట‌గా టాస్క్‌లో తానేంటో నిరూపించుకొని కంటెండ‌ర్‌గా నిలిచాడు. ఇక శోభను కంటెండర్‌ గా వ్యతిరేకిస్తూ ఓటేసిన వాళ్లకు, శోభ‌కి మ‌ధ్య ఓ చికెన్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. ఇందులో స్పైసీగా ఉన్న చికెన్ ముక్కలను వీలైనన్ని తిని.. ఒక నెంబ‌ర్ సెట్ చేయాల‌ని చెబుతాడు బిగ్ బాస్. దీంతో శోభ ఒక మార్క్ సెట్ చేస్తుంది. ఇప్పుడు అదే టాస్క్‌ని సుబ్బు, రైతు బిడ్డ ప్రశాంత్, గౌతమ్‌కు కూడా అదే చేయాల్సింది గా బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇందులో గౌత‌మ్ త్వ‌ర‌గా చికెన్ తిన‌డం వ‌ల‌న అత‌ను విజేత‌గా నిలిచిన‌ట్టు సంచాల‌క్ సందీప్ చెప్పుకొస్తాడు.

క‌ట్ చేస్తే బిగ్ బాస్ అస‌లు ట్విస్ట్ ఇస్తాడు. పీసులు పూర్తిగా తినకపోవడంతో గౌత‌మ్ టాస్క్ లో ఓడిపోయాడ‌ని, శోభా శెట్టి పవర్‌ అస్త్ర కంటెండర్‌గా నిలిచిందని బిగ్ బాస్ చెప్పుకొస్తాడు. ఇక అమ‌ర్ దీప్, ప్రియాంక‌ల‌కి మ‌ధ్య పోటీ నిర్వ‌హించిన బిగ్ బాస్.. కంటెండర్‌ కావాలంటే జుట్టు కత్తిరించుకోవాలని చెప్పుకొస్తాడు. దాని వ‌ల‌న త‌న‌కు ప్రాబ్ల‌మ్ అవుతుంద‌ని చెప్పిన అమ‌ర్..గివ్ అప్ ఇస్తాడు. దీంతో ప్రియాంక షోల్డ‌ర్ వ‌ర‌కు జుట్టు క‌త్తిరించుకుంటుంది. ఈ క్ర‌మంలో యావర్‌, శోభా శెట్టి, ప్రియాంకలు మూడో పవర అస్త్ర కోసం పోటీలో నిలిచేందుకు ఎంపిక‌య్యారు.

ఇక మొన్న‌టివ‌ర‌కు కాస్త గ‌రంగ‌రంగా ఉన్న ప్ర‌శాంత్, ర‌తిక మ‌ళ్లీ క‌లిసారు. ఇద్ద‌రి మ‌ధ్య కాసేపు పులిహార వ్య‌వ‌హారం న‌డ‌వ‌గా, అది అంద‌రికి కాస్త ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఇక వాష్‌ రూమ్‌లో టేస్టీ తేజ తన గెడ్డాన్ని, మీసాలను ట్రిమ్‌ చేసుకోవాల‌ని భావించ‌గా, ట్రిమ్మర్‌లో క్లిప్‌ లేకపోవడంతో తేజ మీసాలు సగం మాత్ర‌మే క‌ట్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో మొత్తం మీసాలు తీసేసాడు. ఇక యావ‌ర్‌లో కామెడీ టైమింగ్ బాగుంది.

హౌజ్‌మేట్స్‌ని ఇమిటేట్ చేస్తూ న‌వ్వులు పూయించాడు. మొత్తానికి తాజా ఎపిసోడ్ ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక ఈ వారం నామినేష‌న్‌లో అమర్‌ దీప్‌, దామిని, గౌతంకృష్ణ, ప్రియాంక, పిన్స్ యావర్‌, రతిక, శుభ శ్రీ ఉండ‌గా, వీరిలో సేవ్ అయ్యేది ఎవ‌రు, ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రు అనే దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

Exit mobile version