Bigg Boss-7 Telugu | బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మాజీ హీరో హీరోయిన్లు..! ఆ ఇద్దరు ఎవరో తెలుసా..?

Bigg Boss-7 Telugu | బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో వచ్చే నెల నుంచి ఏడో సీజన్‌ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అభిమానులు కొత్త సీజన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సారి కంటెస్టెంట్స్‌ను ఎవరిని తీసుకురాబోతున్నారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అయితే, ఇప్పటికే పలువురు సెలెబ్రిటీల పేర్లు బయటకు ప్రచారంలో ఉన్నాయి. అయితే, తాజాగా […]

  • Publish Date - August 25, 2023 / 09:37 AM IST

Bigg Boss-7 Telugu | బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో వచ్చే నెల నుంచి ఏడో సీజన్‌ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అభిమానులు కొత్త సీజన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సారి కంటెస్టెంట్స్‌ను ఎవరిని తీసుకురాబోతున్నారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అయితే, ఇప్పటికే పలువురు సెలెబ్రిటీల పేర్లు బయటకు ప్రచారంలో ఉన్నాయి. అయితే, తాజాగా మాజీ స్టార్‌ హీరో, హీరోయిన్లు సైతం బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

కంటెస్టెంట్‌గా ప్రేమదేశం హీరో..

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌లో అలనాటి తెలుగు హీరో అబ్బాస్‌ సైతం ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్‌. 1996లో ‘ప్రేమదేశం’తో సినీరంగ ప్రవేశం చేశాడు అబ్బాస్‌. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీలో బంపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటించాడు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యాడు. కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌లో సెటిల్‌ అయ్యారు. ఏడాది కిందట తిరిగి భారత్‌కు తిరిగి వచ్చారు. మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకుంటున్నాడని తెలుస్తున్నది. ఇదే సమయంలో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తున్నది. సాలిడ్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు బిగ్‌బాసే సరైన ప్లాట్‌ఫామ్‌ అని భావిస్తున్న అబ్బాస్‌.. కంటెస్టెంట్‌గా వచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా టాక్‌.

సీమశాస్త్రి హీరోయిన్‌ కూడా..

టాలీవుడ్‌ హీరోయిన్‌ ఫర్జానా సైతం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. తెలుగులో ఆరు, ఓ తమిళ చిత్రంలో నటించిన ఫర్జానా ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఫర్జానా.. ఆ తర్వాత అల్లరి నరేశ్‌తో కలిసి ‘సీమశాస్త్రి’లో నటించింది. ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్స్‌లో నటించిన ఫర్జానా.. 2009లో చివరిసారిగా వెండితెరపై కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఫర్జానా.. మరోసారి సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నది. బిగ్‌బాస్‌ తెలుగులో కంటెస్టెంట్‌గా వచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతున్నది. అలాగే గతంలో శృంగార తార ఓ వెలుగు వెలిగిన షకీలా సైతం బిగ్‌బాస్‌లోకి రాబోతున్నట్లు టాక్‌. శృంగార చిత్రాలతో ఎందరో కుర్రాళ్లను అలరించిన షకీలా ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హోస్ట్‌గానూ రాణిస్తున్నది.

ఇప్పటి వరకు వినిపిస్తున్న పేర్లు ఇవే..

బిగ్‌బాస్‌ 6వ సీజన్‌ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి టాస్క్‌ల వరకు అంతా బెడిసికొట్టింది. దీంతో ఈ సారి ఏడో సీజన్‌ కోసం అందరికీ తెలిసిన నటీనటులు, సింగర్స్‌, కమెడియన్స్‌ను బీబీ హౌస్‌లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ వాణి కంటెస్టెంట్‌గా బీబీ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. లేదంటే ఆమె కూతురు సుప్రిత.. లేదంటే ఇద్దరు కలిసి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని టాక్‌. వీరితో పాటు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌ ఫేమ్‌ ‘బుల్లెట్‌ భాస్కర్‌, నరేశ్, వర్ష సైతం బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్‌. అలాగే ప్రముఖ టీవీ నటి శోభాశెట్టి, ప్రముఖ టీవీ నటుడు ఈటీవీ ప్రభాకర్‌, సీరియల్‌ నటి నవ్యస్వామి, యాంకర్ వర్షిణి, యూట్యూబర్‌ అనిల్‌ గీలా, ఆట సందీప్‌, సింగర్‌ మోహన భోగరాజు, టీవీ సీనియల్‌ నటుడు అమర్‌దీప్‌-తేజస్వి గౌడ జంట పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఎవరు బీబీ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారో సెప్టెంబర్‌ 3న తెలియనున్నది.

Latest News