Bigg Boss | తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ రియాలిటీ షోకి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నది. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 7సీజన్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. గత సీజన్ అట్టర్ ప్లాప్ అవడంతో కొత్త సీజన్‌పై నిర్వాహకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 7వ సీజన్‌ను ఎలాగైనా మంచి రేటింగ్స్‌ను విజయవంతం చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం కొత్త వ్యక్తులను హౌస్‌లోకి తేవడంతో పాటు సరికొత్త టాస్క్‌లతో అలరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. […]
Bigg Boss | తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ రియాలిటీ షోకి మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నది. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 7సీజన్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. గత సీజన్ అట్టర్ ప్లాప్ అవడంతో కొత్త సీజన్‌పై నిర్వాహకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 7వ సీజన్‌ను ఎలాగైనా మంచి రేటింగ్స్‌ను విజయవంతం చేయాలని భావిస్తున్నారు.
ఇందు కోసం కొత్త వ్యక్తులను హౌస్‌లోకి తేవడంతో పాటు సరికొత్త టాస్క్‌లతో అలరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొత్త సీజన్ ఆలస్యమవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ సీజన్లో హౌస్‌లోకి సెలబ్రిటీలను తీసుకువచ్చేందుకు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ముఖ్యంగా వివాదాస్పద వ్యక్తులు, విడాకులు తీసుకున్న జంటలతో పాటు కొత్త జంటలను హౌస్‌లోకి తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ లిస్ట్‌లో సీరియల్ యాక్టర్స్ అమర్దీప్ – తేజస్విని జంట, మహేశ్ బాబు కాళిదాసు, సిద్ధార్థ్ వర్మ సైతం ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే యాంకర్స్ రష్మీ గౌతమ్, దీపికా పిల్లి, విష్ణుప్రియ సైతం పేర్లు సైతం వినిపిస్తున్నాయి.
గతంలో ముగ్గురి పేర్లు వినపడినా హౌస్‌లోకి రాలేదు. అలాగే సింగర్లు మంగ్లీ, హేమచంద్ర, మోహన భోగరాజు, సాకేత్ కొమండూరిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపేందుకు మేకర్స్ భావిస్తున్నట్లు సమచారం. గతంలో విడాకులు తీసుకొని వినిడిపోయిన సింగర్ నోయల్, ఎస్తేర్ నోరోన్హా సైతం హౌస్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
అలాగే ఈటీవీ ప్రభాకర్, కొరియోగ్రాఫర్ పండు, జబర్దస్త్ అప్పారావు, టీవీ9 న్యూస్ రీడర్ ప్రత్యూష, డాన్సర్ శ్వేతా నాయుడు, ట్రాన్స్ జెండర్ తన్మయి, మోడల్ సాయి రోనాక్, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్‌ను సైతం హౌస్‌లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తున్నది. దాంతో పాటు 7వ సీజన్‌కు సైతం హోస్ట్‌ను మార్చనున్నారని సమాచారం.
నాగార్జున ప్లేస్‌లో రానా దగ్గుబాటితో హోస్టింగ్ చేయించాలని నిర్ణయించినట్లు టాక్. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పేర్లను బట్టి చేస్తూ ఈ సారి సీజన్ కాస్త రసవత్తరంగానే ఉండనున్నది. స్టార్ యాంకర్స్, సింగర్స్. యూట్యూబర్లు, నోయల్-ఎస్తేర్ జంట హౌస్‌లోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇస్తే షో అదిరిపోతున్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి.