విధాత: భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో తన అంగాన్ని కోసుకున్నాడు. ఈ ఘటన బీహార్‌లోని రాజ్ని నయానగర్ ఏరియాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజ్ని నయానగర్ ఏరియాకు చెందిన కృష్ణ బసుకి, భార్య, ముగ్గురు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కృష్ణ వృత్తిరీత్యా పంజాబ్‌లోని మండిలో ఉంటున్నాడు. రెండు నెలల క్రితం కృష్ణ తన సొంతింటికి తిరిగి వచ్చాడు.
అయితే అతను వచ్చేసరికి భార్య ఇంట్లో లేదు. దీంతో భార్య అనిత ఎక్కడ? అని తల్లిదండ్రులను అడిగాడు. పుట్టింటికి వెళ్లి, తిరిగి రాలేదని చెప్పారు. ఈ క్రమంలో కృష్ణ తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో పదునైన ఆయుధంతో తన పురుషాంగాన్ని కోసుకున్నాడు.
రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే కృష్ణ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.