Warangal
- వరంగల్‌లో కల్లు, గుడాలు, మేకపోతులతో బీజేపీ వినూత్న నిరసన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అర్హులైన నిరుపేదలందరికీ వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్‌లో సోమవారం వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ లు కావాలని దరఖాస్తు పెట్టుకున్న వారితో కల్లు, గుడాలు, మేకపోతులతో నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ బాబు మాట్లాడుతూ గత పాలకులను మించిన రీతిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నేను కట్టిస్తా అని చెప్పి మోసం చేసిన కేసీఆర్ మాటలను గుర్తుచేశారు. కల్లు, గుడాలు, మేకపోతులతో దావత్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మా ఇల్లు మాకు కావాలని, లేని పక్షంలో కేసీఆర్ ను రానున్న ఎన్నికల్లో బొంద పెడతామని కుసుమ సతీష్ హెచ్చరించారు.