Taj Mahal: : వరల్డ్ వండర్ ఆగ్రాలోని తాజ్ మహాల్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి శనివారం యూపీ టూరిజకం కార్యాలయానికి చేసిన మెయిల్ లో తాజ్ మహాల్ ను ఆర్డీఎక్స్ పెట్టి పేల్చేస్తామని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు పర్యాటకులకు అనుమతి నిలిపి వేశారు. తాజ్ మహాల్ వద్ధ హై అలర్ట్ ప్రకటించి సోదాలు చేపట్టారు. 3గంటలకు పైగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించగా..చివరకు ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), తాజ్ సెక్యూరిటీ పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, టూరిజం పోలీసులు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తనిఖీలు నిర్వహించారు. బెదిరింపు ఈమెయిల్‌పై దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు మధ్యాహ్నం 3:30 గంటల నాటికి తాజ్ మహల్‌ను ఆర్డీఎక్స్తో పేల్చివేస్తామని హెచ్చరిస్తు మెయిల్ వచ్చినట్లుగా తెలిపారు. కేరళ నుంచి బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు గుర్తించారు. అదంతా ఫేక్ ఈ మెయిల్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.