Site icon vidhaatha

Kurkure | ఏం పెళ్లాంరా బాబు.. కుర్ కురే కొనివ్వ‌లేద‌ని విడాకులు కోరింది..!

Kurkure | భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య విడాకుల ప్ర‌స్తావ‌న వ‌చ్చిందంటే.. అదేదో బ‌ల‌మైన కార‌ణం ఉంటుంది. వ‌ర‌క‌ట్నం కోసం భార్య‌ను వేధించిన‌ప్పుడు లేదా వివాహేత‌ర సంబంధాలు కొన‌సాగించిన‌ప్పుడు విడాకుల ముచ్చ‌ట వ‌స్తుంది. కానీ ఈవిడ మాత్రం ఐదు రూపాయాల విలువ చేసే కుర్ కురే కొనివ్వ‌లేద‌ని త‌న భ‌ర్త నుంచి విడాకులు కోరింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ జంట‌కు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. అయితే ఆవిడ‌కు కుర్ కురే అంటే మ‌హాప్రాణం. ప్ర‌తి రోజు రూ. 5 కుర్ కురే కొనుక్కొని తిన‌క‌పోతే ఆమె మ‌న‌సులో మ‌న‌సు ఉండ‌దు. ఇక భ‌ర్త కూడా ఆమెకు రోజు కుర్ కురే తీసుకొచ్చేవాడు. అయితే ఓ రోజు మ‌రిచిపోయి తీసుకురాలేదు భ‌ర్త‌.

త‌న‌కు ఎందుకు కుర్ కురే తీసుకురాలేద‌ని భ‌ర్త‌తో భార్య గొడ‌వ‌ప‌డింది. అంత‌టితో ఆగ‌కుండా త‌న పుట్టింటికి వెళ్లింది. ఆ త‌ర్వాత త‌న భ‌ర్త నుంచి త‌న‌కు విడాకులు ఇప్పించాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు షాక్ అయ్యారు. ఆగ్రాలోని షాహ్ గంజ్ పోలీసులు ఈ దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version