Justice BR Gavaih: : దేశ సర్వన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన సీజేఐగా బీఆర్.గవాయ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు హాజరయ్యారు. సీజేఐగా గవాయ్ ఆరు నెలల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. నవంబర్ 23న పదవీ విరమణ చేస్తారు. సీజేఐగా నియామితులైన రెండో దళిత వ్యక్తి గవాయ్ కావడం విశేషం. 2019మే 24నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా..పలు రాజ్యాంగ ధర్మసనాల్లో సభ్యుడిగా కీలకమైన తీర్పులు వెలువరించారు.

మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబంర్ 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 నవంబర్ 14న ముంబై హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2005 నవంబంర్ 12న పూర్తి స్థాయి న్యాయామూర్తిగా పదోన్నతి పొందారు. ముంబాయితో పాటు నాగ్ పూర్, ఔరంగాబాద్ , పనాజీ ధర్మసానాల్లో పనిచేశారు. 2019మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఆరేళ్లలో గవాయ్ 700వరకు ధర్మసనాల్లో జస్టిస్ గా పనిచేశారు. రాజ్యాం, పరిపాలన, సివిల్, క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిటేషన్, విద్యుత్తు, విద్య, పర్యావరణానికి సంబంధించి అనేక కేసులను విచారించి చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు.