MLA Rajaiah | దిగొచ్చిన BRS అధినాయకత్వం.. ఎమ్మెల్యే రాజయ్యతో చీఫ్ విప్ వినయ్ మంతనాలు

MLA Rajaiah | పార్టీ వీడుతారని తీవ్ర చర్చ సంప్రదింపుల వేళ ఎమ్మెల్యే అసంతృప్తి? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా? కాంగ్రెస్ లోకి మారుతారా? ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ లోకి వెళుతున్నట్లు ప్రచారం జరగడంతో రాజయ్య ఇంటికి మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వెళ్లారు. పార్టీ అధిష్టానం […]

  • Publish Date - September 5, 2023 / 01:31 PM IST

MLA Rajaiah |

  • పార్టీ వీడుతారని తీవ్ర చర్చ
  • సంప్రదింపుల వేళ ఎమ్మెల్యే అసంతృప్తి?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా? కాంగ్రెస్ లోకి మారుతారా? ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ లోకి వెళుతున్నట్లు ప్రచారం జరగడంతో రాజయ్య ఇంటికి మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వెళ్లారు. పార్టీ అధిష్టానం దూతగా ఆయన రాజయ్యతో సంప్రదింపులు జరిపేందుకు వెళ్లినట్లు సమాచారం.

సోమవారం మాదిగ, చమరు ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఒక హోటల్లో జరిగిన మీటింగుకు ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో ప్రత్యేకంగా రాజయ్య భేటీ అయ్యారు. ఇది రాజకీయ దుమారం రేపింది. ఇదే సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తదితరులను పక్కకు పంపించి.. ఎమ్మెల్యే రాజయ్యతో రాజనర్సింహ మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది.

రాజయ్య.. మౌనమే!

స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కని నేపథ్యంలో రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఆయన బీఆర్ఎస్ లో ఉంటాడా? ఇతర పార్టీలోకి మారతారా? అనే చర్చ ప్రస్తుతం సాగుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఇప్పటికీ సాగుతున్నాయి. రాజనర్సింహ, ఎమ్మెల్యే రాజయ్య భేటీతో బీఆర్ఎస్ అధిష్టానం స్పందించినట్లు తెలుస్తోంది. రాజయ్యతో సంప్రదింపులు, మంతనాలు జరిపేందుకు దూతగా వినయ్ భాస్కర్‌ను పంపించినట్లు చెబుతున్నారు.

ఇద్దరి మధ్య పార్టీ మార్పు విషయమై చర్చ జరిగినట్లు సమాచారం. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఎమ్మెల్యే రాజయ్య ఖండించకపోయినప్పటికీ, మౌనం వహించినట్లు తెలిసింది. తన అసంతృప్తిని మాత్రం వినయ్ భాస్కర్ తో వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. పార్టీ మార్పు విషయంలో రాజయ్య ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని సమాచారం.

మాదిగలు అంటే నాకు ప్రేమాభిమానాలు: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

రాష్టంలో ఎక్కడ మాదిగ కులస్తులు మీటింగ్ పెడితే అక్కడ నేను ఉంటా. మాదిగలంటే నాకు ప్రేమాభిమానాలు. నా నరనరాల్లో మాదిగ రక్తం ఉంది. మంద కృష్ణ మాదిగ పెట్టిన ఎమ్మార్పీఎస్ లో నేను చురుగ్గా పాల్గొన్నా. అందుకే నేను ఎమ్మెల్యే అయ్యా. ఈ క్రమంలోనే మాదిగ మేధావుల సదస్సుకు హాజరయ్యా.

కార్యక్రమానికి కలిసి వెళ్లేందుకు వచ్చా.. దాస్యం వినయ్ భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్

గురు పూజోత్సవం సందర్భంగా టీచర్ యూనియన్ సంఘాలు రాజయ్యను, నన్ను ఆహ్వానించారు. అందుకే ఇద్దరం కలిసి వెళ్తున్నాం. రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వార్తల నేపథ్యంలో తాను రాలేదు. ఇది సాధారణ కలయిక మాత్రమే

Latest News