MLA Jagadish Reddy | రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం

రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారంలో, ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు

  • Publish Date - April 15, 2024 / 05:50 PM IST

రాష్ట్రంలో మళ్లీ కరెంటు.. సాగు తాగునీటి కష్టాలు
మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ధ్వజం

విధాత : రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారంలో, ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం భువనగిరి బీఆరెస్‌ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బీఆరెస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారని, అయినా ఈ ప్రభుత్వానికి కనబడడం లేదని దుయ్యబట్టారు.

2014 ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు వచ్చిందని, తెలంగాణలో మళ్లీ ఆడవాళ్లు బిందెలు పట్టుకుని రోడ్లమీదకి వచ్చే పరిస్థితి వచ్చిందని, రైతులకు సాగు నీళ్లు లేవని, కరంట్ లేదని, కాంగ్రెస్ వచ్చింది సర్వనాశనం అయిందన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ సమస్యల పాలు చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు, రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టి ఓడించాలన్నారు. కాంగ్రెస్ అహంకారం అణిచివేసి, బొంద పెట్టాలన్నారు. అమలు కాని హామీలిచ్చికాంగ్రెస్ దద్దమ్మలు మార్పు తెస్తామంటే మీకు పట్టం కట్టారన్నారు.

ఇప్పుడు గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే నిజమే మార్పు వచ్చిందని అది రైతుల పంటలు ఎండిపోతున్నాయని, దొంగతనలు జరుగుతున్నాయని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు భరోసా, ప్రజలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, జిల్లాలో వరస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. కుక్కల్లాగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి మొరుగుతున్నాడని, నెల రోజుల నుంచి జిల్లాలో కనబడుత లేడని, ధాన్యం కొనుగోలులో సమస్యలతో రైతులకి ముఖం చాటేశాడని విమర్శించారు. మిర్యాలగూడలో వడ్ల కొనుగోలులో మిల్లర్ల పై చర్యలు గురించి కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారని, ఏమైందని, చర్యలు లేకపోగాగా గిట్టుబాటు ధర ఇవ్వడం మానేశారన్నారు.

మోదీని ఎదిరించిన వ్యక్తి కేసీఆర్ అని, మోదీనే ఏం పీకలేక పోయిండని,,మీరేం పీకుతారని, కేసీఆర్ ముందు కాంగ్రెస్ వాళ్లు ఎంత అని, కేసీఆర్ కాలి గోటికీ కూడా పనికిరారని విమర్శించారు. రైతుల ధాన్యం కొనుగోలు కోసం క్వింటాల్‌కు రూ. 2,700 మద్దతు ధర ఇవ్వాల్సి ఉంటే.. రూ.2,100 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. మిల్లర్లతో అధికార పార్టీ కుమ్మక్క అయిందని ఆరోపించారు. ప్రజలు కోరుకున్న మార్పు దిశగా మాత్రం ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాడుతామన్నారు.

Latest News