Site icon vidhaatha

MLC Kavitha | పిడికిలి బిగించి, అభివాదం.. అనంత‌రం ఈడీ ఆఫీసులోకి ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha | ఢిల్లీ లిక్క‌ర్ స్కాం( Delhi Liquor Scam )కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత( MLC Kavitha ) శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి( ED Office ) చేరుకున్నారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు క‌విత త‌న పిడికిలి బిగించి, త‌న మ‌ద్ద‌తుదారుల‌కు అభివాదం చేశారు. అనంత‌రం కార్యాల‌యంలోకి ఆమె వెళ్లారు. ఇక ఢిల్లీలోని త‌న ఇంటి నుంచి క‌విత ఈడీ ఆఫీసుకు బ‌య‌ల్దేరే ముందు.. బీఆర్ఎస్ నాయ‌కులు( BRS Leaders ) భారీ స్థాయిలో చేరుకుని మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

క‌విత‌ను విచారిస్తున్న నేప‌థ్యంలో ఈడీ కార్యాల‌యం వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీసు ప‌రిస‌ర ప్రాంతాల‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. క‌విత‌ను అరెస్టు చేస్తార‌ట అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో ఈడీ విచార‌ణ అనంత‌రం ఏం జ‌ర‌గ‌బోతుంద‌ని బీఆర్ఎస్ శ్రేణులు ప్ర‌శ్నించుకుంటున్నారు.

వాస్తవానికి ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే, అదే రోజు మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష చేప‌ట్టే కార్య‌క్ర‌మం ఉండడంతో సమయం కావాలని ఈడీని క‌విత‌ కోరారు. ఈ క్రమంలో శనివారం విచారణకు రావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మద్యం పాలసీ వ్యవహారంలో ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అంతకు ముందు విచారణ సమయంలో కవితకు బినామీగా ఉన్నట్లు అరుణ్‌ పిళ్లై ఒప్పుకున్నట్లు ఈడీ తెలిపింది. మరో వైపు తాను కవితకు బినామీనని ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ అరుణ్‌ పిళ్లై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం విశేషం. ఈ క్రమంలోనే అరుణ్‌ పిళ్లై.. కవితను ఇద్దరిని ముఖాముఖిగా విచారించే అవ‌కాశం ఉంది.

Exit mobile version