BRS విధివిధానాలపై ప్రకటన.. నెలాఖరున ఢిల్లీలో కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌..!

విధాత‌, హైదరాబాద్‌: క్రిస్మస్‌ తర్వాత దేశవ్యాప్తంగా భారత్‌ రాష్ట్ర సమితి కార్యక్రమాలు ఊపందుకో నున్నాయి. పలు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ ప్రారంభానికి సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్‌ చివరికల్లా ఆరు రాష్ట్రాల్లో కిసాన్‌ సెల్‌ ప్రారంభానికి నిర్ణయించినట్లు తెలుస్తున్నది. బీఆర్‌ఎస్‌ భావజాల వ్యాప్తికి పలు భాషల్లో సాహిత్యాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. కన్నడ, మరాఠా, ఒడిశా సహా పలుభాషల్లో సాహిత్యం సిద్ధమైందని, ఈ మేరకు పలు భాషల సాహిత్యకారులకు కేసీఆర్‌ సూచనలిస్తున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌లో […]

  • Publish Date - December 20, 2022 / 01:59 PM IST

విధాత‌, హైదరాబాద్‌: క్రిస్మస్‌ తర్వాత దేశవ్యాప్తంగా భారత్‌ రాష్ట్ర సమితి కార్యక్రమాలు ఊపందుకో నున్నాయి. పలు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ ప్రారంభానికి సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్‌ చివరికల్లా ఆరు రాష్ట్రాల్లో కిసాన్‌ సెల్‌ ప్రారంభానికి నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

బీఆర్‌ఎస్‌ భావజాల వ్యాప్తికి పలు భాషల్లో సాహిత్యాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. కన్నడ, మరాఠా, ఒడిశా సహా పలుభాషల్లో సాహిత్యం సిద్ధమైందని, ఈ మేరకు పలు భాషల సాహిత్యకారులకు కేసీఆర్‌ సూచనలిస్తున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌లో చేరికలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ క్రమంలో డిసెంబర్‌ నెలాఖరులో ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా కేసీఆర్‌ భారత రాష్ట్ర సమితి విధి విధానాలను ప్రకటించ నున్నారని సమాచారం. ఇదిలా ఉండగా.. ఇవాళ కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవత్‌ మాన్‌తో భేటీ అయ్యారు.

జాతీయ రాజకీయాలతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ నెల 14న ఢిల్లీలోని సర్ధార్‌ పటేల్‌ రోడ్‌లో బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించి, బీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేశారు.

కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు పలువురు రైతు సంఘం నేతలు పాల్గొన్న విషయం తెలిసిందే. ‘అబ్ కీ బార్.. కిసాన్ స‌ర్కార్’ భార‌త్‌ రాష్ట్ర స‌మితి నినాదమన్న కేసీఆర్‌.. ఢిల్లీలోని ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.