- సిర్పూర్ నుంచి బరిలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
విధాత, హైద్రాబాద్ : తెలంగాణ బీఎస్పీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నఅభ్యర్థుల తొలి జాబితాను వెల్లడయ్యింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తొలి జాబితాలో 20మంది అభ్యర్ధులను ప్రకటించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ జనరల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో ఇందులో ఇద్దరు మహిళా అభ్యర్థులున్నారు.
నకిరేల్, పెద్దపల్లి స్థానాల్లో మేడి ప్రియదర్శిని, దాసరి ఉషాలను అభ్యర్థులుగా ఖరారు చేశారు. జహిరాబాద్ (ఎస్సీ) , పెద్దపల్లిలో, తాండూర్, దేవరకొండ(ఎస్టీ), చొప్పదండి(ఎస్సీ), ఆలేరు, వైరా(ఎస్టీ), ధర్మపురి(ఎస్సీ), వనపర్తి, మానుకొండూరు(ఎస్సీ), కోదాడ, నాగర్ కర్నూల్, ఖానాపూర్(ఎస్టీ), ఆంథోల్(ఎస్సీ), వికారాబాద్, కొత్తగూడెంలో, జుక్కల్(ఎస్సీ) స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.