Site icon vidhaatha

స్టాక్ మార్కెట్ల‌కు బ‌డ్జెట్ జోష్‌

విధాత‌: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి (2023-24)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బుధ‌వారం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ను మ‌దుప‌రులు మెచ్చారు.

దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 948 పాయింట్ల లాభంతో 60,498 పాయింట్ల వ‌ద్ద ట్రేడ్ అవుతున్న‌ది. నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 233 పాయింట్లు పెరిగి 17,895 వ‌ద్ద న‌డుస్తున్న‌ది. ప‌న్ను శ్లాబుల్లో మార్పులు, ప‌న్నుల మిన‌హాయింపు వంటి వాటిని మార్కెట్ స్వాగ‌తించిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Exit mobile version