Bungee jump | భార్య‌కు విడాకులిచ్చిన ఆనందంలో బంగీ జంప్.. యువ‌కుడికి తీవ్ర గాయాలు

విధాత‌: సంసార జీవితం సాఫీగా సాగిపోతే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. కానీ ఆ సంసార జీవితంలో అవాంత‌రాలు ఎదురైతే మాత్రం.. అంతే సంగ‌త‌లు. అటు భ‌ర్తనో.. ఇటు భార్య‌నో విడాకులు కోరుకుంటారు. ఆ దంప‌తులు కోరుకున్న‌ట్టే విడాకులు మంజూరైతే.. మ‌రో కొత్త జీవితానికి నాంది ప‌లుకుతారు. అయితే ఓ యువ‌కుడు త‌న భార్య‌తో విడాకులు తీసుకున్న ఆనందంలో ఓ పెద్ద సాహ‌సమే చేశాడు. బంగీ జంప్ (Bungee jump) చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. […]

  • Publish Date - May 9, 2023 / 06:15 AM IST

విధాత‌: సంసార జీవితం సాఫీగా సాగిపోతే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. కానీ ఆ సంసార జీవితంలో అవాంత‌రాలు ఎదురైతే మాత్రం.. అంతే సంగ‌త‌లు. అటు భ‌ర్తనో.. ఇటు భార్య‌నో విడాకులు కోరుకుంటారు. ఆ దంప‌తులు కోరుకున్న‌ట్టే విడాకులు మంజూరైతే.. మ‌రో కొత్త జీవితానికి నాంది ప‌లుకుతారు. అయితే ఓ యువ‌కుడు త‌న భార్య‌తో విడాకులు తీసుకున్న ఆనందంలో ఓ పెద్ద సాహ‌సమే చేశాడు. బంగీ జంప్ (Bungee jump) చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ డోస్ శాంటోస్ తోస్టా(22) అనే యువ‌కుడికి కొద్ది నెల‌ల క్రితం వివాహ‌మైంది. అయితే త‌న భార్య‌తో ఏర్ప‌డ్డ విబేధాల కార‌ణంగా విడాకులు తీసుకున్నాడు. ఇక భార్య‌తో విడాకులు తీసుకోవ‌డంతో.. త‌న‌కు న‌చ్చిన‌ట్లు జీవితాన్ని ఎంజాయ్ చేయాల‌ని ఆ యువ‌కుడు భావించాడు. ఇంకేముంది.. బంగీజంప్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

ఆ బంగీ జంప్ కోసం బ్రెజిల్‌లోని కాంపో మాగ్రోలో బ్రిడ్జ్ స్వింగ్‌లో పాల్గొన‌డానికి వెళ్లాడు. ఈ స్టంట్‌లో భాగంగా 70 అడుగుల ఎత్తు నుంచి ఆ యువ‌కుడు జంప్ చేశాడు. ప్ర‌మాద‌వ‌శాత్తు తాడు తెగిపోవ‌డంతో.. రాఫెల్ కింద‌నున్న నీటి కొల‌నులో ప‌డిపోయాడు. అత‌ని శ‌రీర‌మంతా తీవ్ర గాయాల‌య్యాయి. ఆస్ప‌త్రిలో చేరిన రాఫెల్.. మూడు నెల‌ల చికిత్స అనంత‌రం కోలుకున్నాడు. రాఫెల్ కోలుకోవ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.