Site icon vidhaatha

ఘోర రోడ్డుప్ర‌మాదం: బ‌స్సులో మంటలు.. 14 మంది స‌జీవ‌ద‌హ‌నం

విధాత: మ‌హారాష్ట్ర‌లోని నాసిక్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఔరంగాబాద్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేటు బ‌స్సు, కంటైన‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో బ‌స్సులో అగ్నికీల‌లు ఎగిసి ప‌డ్డాయి. క్ష‌ణాల్లోనే బ‌స్సు అంత‌టా మంట‌లు వ్యాపించాయి. మంట‌ల ధాటికి 14 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. మ‌రో 32 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది. క్ష‌త‌గాత్రుల‌ను పోలీసులు స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బ‌స్సులో అగ్నికీల‌లు ఎగిసి ప‌డ‌టంతో.. ఆ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఓ గంట పాటు ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డ ఆగిపోయాయి.

Exit mobile version