తెలుగులోనూ సి-విజిల్ యాప్ కావాలి

ఎన్నికల నిర్వాహణ సమస్యలపై, నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయడానికి ప్రజలకు సులభతరంగా అందుబాటులో ఉన్న సి విజిల్ యాప్ కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది

విధాత : ఎన్నికల నిర్వాహణ సమస్యలపై, నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయడానికి ప్రజలకు సులభతరంగా అందుబాటులో ఉన్న సి విజిల్ యాప్ కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ యాప్ 8 భాషల్లో అందుబాటులో ఉంది. అయితే తెలుగు భాషలో అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా తయారైంది. దక్షిణ భారతదేశంలోని కన్నడ, మలయాళ, తమిళ భాషలలో సి విజిల్ యాప్ అందుబాటులో ఉన్నప్పుడు తెలుగులో ఎందుకులేదన్న అసంతృప్తి తెలుగు ప్రజల్లో, పార్టీల శ్రేణుల్లో వినిపిస్తున్నది.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వివిధ పట్టణాలు, మండలాలు, గ్రామాల్లోని ప్రజల్లో ఇప్పటికి తెలుగునే ఎక్కువగా వాడుకలో ఉంది. వారికి తమ సమస్యలను చెప్పుకోవడంలో, లిఖిత పూర్వకంగా వెలిబుచ్చడంలో తెలుగు తప్ప ఇతర భాషలో అంతగా ప్రావీణ్యం ఉండదు. ఈ నేపధ్యంలో తెలుగు ప్రజల సౌకర్యార్ధం ఎన్నికల సంఘం సి విజిల్ యాప్‌ను తెలుగు భాషలో కూడా అందుబాటులోకి తేవాలని తెలంగాణ పార్టీలు, ప్రజలు కోరుకుంటున్నారు.

Latest News