పల్లెల్లో పండుగలా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

చిట్టపు వారి గూడెంలో పూజలు.. కేక్ కటింగ్.. పాలాభిషేకాలు !! విధాత: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ శ్రేణుల సారథ్యంలో గ్రామీణుల భాగస్వామ్యంతో పల్లెల్లో పండుగల సాగుతున్నాయి. హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామపంచాయతీ చిట్టపు వారి గూడెంలో ఆదివారం గ్రామస్తులంతా కలిసి బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పండగలా నిర్వహించడం విశేషం. బీఆర్ఎస్ జైత్ర యాత్ర తెలంగాణ నుండి దేశమంతా కొనసాగాలని ఆకాంక్షిస్తూ గ్రామంలోని ఆలయంలో పూజలు నిర్వహించారు. కేక్ కట్ […]

  • Publish Date - December 18, 2022 / 07:03 AM IST
  • చిట్టపు వారి గూడెంలో పూజలు.. కేక్ కటింగ్.. పాలాభిషేకాలు !!

విధాత: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ శ్రేణుల సారథ్యంలో గ్రామీణుల భాగస్వామ్యంతో పల్లెల్లో పండుగల సాగుతున్నాయి. హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామపంచాయతీ చిట్టపు వారి గూడెంలో ఆదివారం గ్రామస్తులంతా కలిసి బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను పండగలా నిర్వహించడం విశేషం.

బీఆర్ఎస్ జైత్ర యాత్ర తెలంగాణ నుండి దేశమంతా కొనసాగాలని ఆకాంక్షిస్తూ గ్రామంలోని ఆలయంలో పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జి. జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిల ప్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు

జై టిఆర్ఎస్.. సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలని, ఎమ్మెల్యే శానంపూడి జిందాబాద్ అంటూ జై కొట్టిన గ్రామస్తులు బీఆర్ఎస్ కు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, దిర్శించర్ల సర్పంచ్ మాగంటి మాధవి సైదులు, ఉప సర్పంచ్ కందుకూరి గోవర్ధన్ రెడ్డి, చిట్టెపు వారి గూడెం గ్రామ పెద్దలు గున్ రెడ్డి నాగిరెడ్డి, ఉట్కూరి పిచ్చిరెడ్డి, చిట్టెపు వెంకటరెడ్డి, తుమ్ములూరి పెద్ద గోపిరెడ్డి, చిట్టెపు నాగిరెడ్డి, కే. సైదిరెడ్డి. తుంగ రంగారెడ్డి, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.