27నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం

టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబు నాయుడు ఈ నెల 27 తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు

  • Publish Date - March 24, 2024 / 01:55 PM IST

ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం

విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబు నాయుడు ఈ నెల 27 తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షో లు నిర్వహిస్తారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 27 తేదీ నుంచి 31 తేదీ వరకు పర్యటన ఖారారు చేశారు. 27వ తేదీ పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్ లలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 28వ తేదీ రాప్తాడు, సింగనమల, కదిరిలలో, 29వ తేదీ శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30 మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో చంద్రబాబు ఎన్నికల ప్రచారాలు కొనసాగతాయి. 31వ తేదీ కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలు లలో చంద్రబాబు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.